![]() |
![]() |

`అతడు`, `ఖలేజా` వంటి క్లాసిక్స్ తరువాత సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. ముచ్చటగా మూడోసారి జట్టుకడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో మహేశ్ కి జోడీగా `బుట్టబొమ్మ` పూజా హెగ్డే దర్శనమివ్వనుండగా.. యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హారికా అండ్ హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనుంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ నవంబర్ ప్రథమార్ధంలో ప్రారంభం కానుందని సమాచారం. అంతేకాదు.. చకచకా చిత్రీకరణ జరిపి ఏప్రిల్ నాటికి సినిమాని పూర్తి చేయాలని త్రివిక్రమ్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తోందట. మరి.. భారీ అంచనాల మధ్య రాబోతున్న మహేశ్ - త్రివిక్రమ్ థర్డ్ జాయింట్ వెంచర్.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.కాగా, మహేశ్ ప్రస్తుతం `సర్కారు వారి పాట`తో బిజీగా ఉన్నారు. `గీత గోవిందం` దర్శకుడు పరశురామ్ రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో కీర్తి సురేశ్ నాయికగా నటిస్తోంది. తమన్ సంగీతమందిస్తున్న ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
![]() |
![]() |