![]() |
![]() |

హాలీవుడ్ సీనియర్ నటుడు మైఖేల్ కెన్నెత్ విలియమ్స్(54) కన్నుమూశారు. అమెరికా ప్రముఖ టెలివిజన్ షో 'దివైర్' సిరీస్ తో ఆడియొన్స్ కు దగ్గరైన ఆయన.. డ్రగ్స్‌కు బానిసై మృతి చెందారు.
'ది వైర్'లో ఒమర్ లిటిల్ క్యారెక్టర్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్నారు మైఖేల్ కె విలియమ్స్. భార్య చనిపోయాక కొడుకుతో ఉంటున్న ఆయన.. కొన్ని నెలలుగా డ్రగ్స్‌కు బానిసయ్యారు. ఈ క్రమంలోనే ఆయన బ్రూక్లిన్ లోని అపార్ట్‌మెంట్ లో ఒంటరిగా ఉంటున్నారు. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో డ్రగ్స్ అలవాటు గురించి ప్రస్తావించిన ఆయన.. దాని నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నట్లు కూడా చెప్పారు.
అయితే రెండు రోజులుగా మైఖేల్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో.. ఆయన స్నేహితుడు ఆపార్ట్ మెంట్ కు వెళ్లి చూసే సరికి మైఖేల్ శవంగా కనిపించారు. డ్రగ్స్ ప్యాకెట్స్ మధ్య మైఖేల్ మృతదేహాంగా కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. డ్రగ్స్ ఓవర్ డోస్ వల్లే మైఖేల్ చనిపోయినట్లు ప్రాథమిక పరీక్షల్లో నిర్దారణ అయ్యింది. మైఖేల్ స్నేహితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
![]() |
![]() |