![]() |
![]() |

`మాస్టర్` వంటి బ్లాక్ బస్టర్ తరువాత కోలీవుడ్ స్టార్ విజయ్ నటిస్తున్న చిత్రం `బీస్ట్`. `బుట్టబొమ్మ` పూజా హెగ్డే నాయికగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ బాణీలు అందిస్తున్నాడు. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తిచేసుకున్న `బీస్ట్`.. త్వరలో తదుపరి షెడ్యూల్ కి వెళ్ళనుంది.
ఇదిలా ఉంటే.. `బీస్ట్`లో మరో ఇద్దరు కోలీవుడ్ స్టార్స్ భాగం కానున్నారని సమాచారం. ఆ ఇద్దరు మరెవరో కాదు.. తెలుగువారికి కూడా సుపరిచితమైన ధనుష్, శివకార్తికేయన్. అయితే, తెరపై కాకుండా తెర వెనుక ఈ ఇద్దరు పనిచేయబోతున్నారట. `బీస్ట్` కోసం ఓ పాటని ధనుష్ పాడనుండగా.. మరో గీతం శివకార్తికేయన్ సాహిత్యంతో రూపొందనుందట. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
సెల్వ రాఘవన్, యోగిబాబు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న `బీస్ట్`.. 2022 పొంగల్ స్పెషల్ గా సందడి చేయనుంది.
![]() |
![]() |