![]() |
![]() |

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్'. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించిది చిత్రబృందం.
'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్' మూవీని ఈ ఏడాది ప్రారంభంలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ పలు కారణాల వల్ల మూవీ విడుదల వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు మూవీ విడుదల తేదీపై అధికారిక ప్రకటన వచ్చింది. విజయదశమి కానుకగా అక్టోబర్ 8న మూవీ రిలీజ్ చేస్తున్నట్టు తెలుపుతూ ఓ కొత్త పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్.

అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. అఖిల్ తన గత మూడు చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో.. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్'పై ఆశలు పెట్టుకున్నాడు. మరి ఈ సినిమాతో అఖిల్ విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.
![]() |
![]() |