![]() |
![]() |

రెండేసి పాత్రలు పోషించిన సందర్భాలన్నింటిలోనూ కింగ్ నాగార్జునకి మంచి ఫలితాలే దక్కాయి. `జానకి రాముడు`, `హలో బ్రదర్!`, `ఎదురులేని మనిషి`, `మనం`, `సోగ్గాడే చిన్ని నాయనా`.. ఇలా నాగ్ డ్యూయెల్ రోల్స్ చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ ముంగిట వసూళ్ళ వర్షం కురిపించాయి. వీటిలో `జానకి రాముడు`, `మనం` పునర్జన్మ కథలతో తెరకెక్కిన సినిమాలు కావడం విశేషం.
ఇదిలా ఉంటే.. ఐదేళ్ళ విరామం అనంతరం నాగ్ మరోసారి ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఆ చిత్రమే.. `బంగార్రాజు`. `సోగ్గాడే చిన్ని నాయనా`కి సీక్వెల్ గా రూపొందుతున్న ఈ సోషియో ఫాంటసీలో మరోసారి తండ్రీకొడుకులుగా కనిపించబోతున్నారాయన. `సోగ్గాడే..`లోని బంగార్రాజు, డాక్టర్ రామ్ మోహన్ పాత్రలు ఇందులోనూ కొనసాగబోతున్నాయని సమాచారం. మరి.. నాగ్ డ్యూయెల్ రోల్స్ చేసిన సందర్భాలన్నీ వర్కవుట్ అయిన నేపథ్యంలో.. ఆ ఫ్యాక్టర్ `బంగార్రాజు`కి కూడా ప్లస్ అవుతుందేమో చూడాలి.
కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న `బంగార్రాజు`లో నాగచైతన్య మరో హీరోగా నటిస్తుండగా.. నాగ్ కి జంటగా రమ్యకృష్ణ, చైతూకి జోడీగా కృతి శెట్టి కనిపించనున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుందని బజ్.
![]() |
![]() |