![]() |
![]() |

రైట్ నౌ సూపర్ స్టార్ రజినీకాంత్ `అణ్ణాత్తే`లో నటిస్తున్నారు. `శౌర్యం` శివ డైరెక్ట్ చేస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో ఖుష్బూ, మీనా, నయనతార, కీర్తి సురేశ్, జగపతిబాబు వంటి భారీ తారాగణం సందడి చేయనుంది. చిత్రీకరణ తుది దశకు చేరుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని.. దీపావళి కానుకగా నవంబర్ 4న విడుదల చేయబోతున్నారు.
ఇదిలా ఉంటే.. రజినీకాంత్ తదుపరి చిత్రానికి సంబంధించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. `పసంగ`, `కేడి బిల్లా కిలాడి రంగా`, `కడైకుట్టి సింగమ్` (తెలుగులో `చినబాబు`) వంటి విజయవంతమైన సినిమాలను రూపొందించిన పాండిరాజ్ దర్శకత్వంలో రజినీ తన నెక్స్ట్ వెంచర్ చేయనున్నారట. అంతేకాదు.. ఇదో విలేజ్ డ్రామాని సమాచారం. ప్రస్తుతం సూర్య కాంబినేషన్ లో `ఎదర్కుమ్ తుణిందవన్` అనే సినిమా చేస్తున్నారు పాండిరాజ్. అదయిన వెంటనే సూపర్ స్టార్ ని డైరెక్ట్ చేస్తారట. త్వరలోనే రజినీకాంత్ - పాండిరాజ్ కాంబో మూవీపై క్లారిటీ రానుంది.
వాస్తవానికి, `అణ్ణాత్తే` తరువాత `కణ్ణుమ్ కణ్ణుమ్ కొల్లైయడిత్తాల్` (తెలుగులో `కనులు కనులను దోచాయంటే`) ఫేమ్ దేశింగు పెరియస్వామి దర్శకత్వంలో గానీ, `పిజ్జా` ఫేమ్ కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో గానీ సూపర్ స్టార్ సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది. ఇప్పుడు అనూహ్యంగా పాండిరాజ్ పేరు వార్తల్లోకి రావడం గమనార్హం. చివరాఖరికి.. రజినీ నెక్స్ట్ డైరెక్టర్ ఎవరవుతారో చూడాలి.
![]() |
![]() |