![]() |
![]() |
.jpg)
'ఆర్ఆర్ఆర్' షూటింగ్ రెండు రోజుల క్రితమే కంప్లీట్ అయ్యింది. కొన్ని పికప్ షాట్స్ తప్ప సినిమా మొత్తం షూటింగ్ కంప్లీట్ అయ్యిందని రాజమౌళి అండ్ టీమ్ అనౌన్స్ చేసింది. 2018 నవంబర్ 19న ఏ బైక్ షాట్‌తో అయితే షూటింగ్ స్టార్ట్ చేశామో, అదే బైక్ షాట్‌తో కంప్లీట్ చేశామని చెప్పారు. పని పూర్తి కావడంతో 'ఆర్ఆర్ఆర్' హీరోయిన్లలో ఒకరైన విదేశీ భామ ఒలీవియా మోరిస్ శుక్రవారం సరదాగా హైదరాబాద్ సిటీ టూర్ వేశారు.
'ఆర్ఆర్ఆర్' యంగ్ టైగర్ ఎన్టీఆర్ జోడీగా ఒలీవియా మోరిస్ కనిపించనున్న సంగతి తెలిసిందే. ఫైనల్ షెడ్యూల్ లో ఆమె కూడా పాల్గొన్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నారు. శుక్రవారం సరదాగా సిటీ చూశారు. శిల్పారామం ఆమెకు బాగా నచ్చినట్టు ఉంది. ముఖ్యంగా పానీ పూరి, దాహి పూరి, చాట్ తిన్నారు. చిరుతిళ్లు ఫోటోలు తీసుకుని మరీ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
.jpg)
"హైదరాబాద్ లో చక్కటి వర్షం పడుతున్న రోజు" అని పేర్కొన్నారు. హీరోయిన్లు చాలామందికి చిరుతిళ్ళు తినాలని ఉంటుంది. కానీ, లావైపోతామని దూరంగా ఉంటారు. ఒలీవియా మాత్రం టేస్ట్ చేశారు.
.jpg)
![]() |
![]() |