![]() |
![]() |

యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. వరుస అవకాశాలు, వరుస విజయాలతో కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం తమన్ చేతిలో డజనుకి పైగా సినిమాలున్నాయి.
ఇదిలా ఉంటే.. 2021లో ఫెస్టివల్ స్పెషల్ మ్యూజికల్ డైరెక్టర్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు తమన్. సంక్రాంతి సీజన్ లో `క్రాక్` చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన తమన్.. ఉగాది సమయంలో జనం ముందుకు వచ్చిన `వకీల్ సాబ్`తోనూ ఇంప్రెస్ చేశాడు. ఈ క్రమంలోనే.. ఈ ఏడాది మరో రెండు ముఖ్యమైన పండగల్లో తన స్వరాలతో అలరించనున్నాడు.
ఆ వివరాల్లోకి వెళితే.. నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా రూపొందిన `టక్ జగదీష్` చిత్రానికి తమన్ సంగీతమందించాడు. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్.. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. ఇక దీపావళి సీజన్ లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్ లో `గని` చిత్రంతో పలకరించనున్నాడు తమన్. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో వరుణ్ బాక్సర్ గా కనిపించబోతున్నాడు.
మరి.. రాబోయే ఫెస్టివల్ స్పెషల్ మూవీస్ తోనూ తమన్ విజయాలు అందుకుంటాడేమో చూడాలి.
![]() |
![]() |