Home  »  News  »  చాలా కాలం త‌ర్వాత తెలుగులో బ‌ప్పీల‌హిరి సంగీతం

Updated : Aug 28, 2021

 

బ‌ప్పీల‌హిరి అన‌గానే మ‌న‌కు సింహాస‌నం, త్రిమూర్తులు, గ్యాంగ్ లీడ‌ర్‌, రౌడీ అల్లుడు, రౌడీ ఇన్‌స్పెక్ట‌ర్‌, స్టేట్ రౌడీ, నిప్పుర‌వ్వ సినిమాల్లోని పాట‌లు గుర్తుకొస్తాయి. బాలీవుడ్‌లో అయితే ఆయ‌న ఒక సంచ‌ల‌నం. ఎన్ని సినిమాల‌కు బ్లాక్‌బ‌స్ట‌ర్ మ్యూజిక్ అందించారో! అక్క‌డ డిస్కో కింగ్‌గా ఆయ‌న పేరు పొందారు. ఎప్ప‌టిక‌ప్పుడు విన‌సొంపైన బాణీల‌తో సంగీత ప్రియులను ఉర్రూతలూగిస్తూనే ఉన్నారు. చాలా కాలం త‌ర్వాత ఆయ‌న తెలుగు సినిమాకు ప‌నిచేయ‌బోతున్నారు. చ‌ద‌ల‌వాడ బ్ర‌ద‌ర్స్‌గా అంద‌రూ పిలుచుకొనే చ‌ద‌ల‌వాడ తిరుప‌తిరావు, చ‌ద‌ల‌వాడు శ్రీ‌నివాస‌రావు నిర్మించ‌నున్న ఓ భారీ యాక్షన్ చిత్రానికి బప్పీలహరి సంగీతం సమకూర్చబోతున్నట్లు ఆ చిత్ర దర్శకుడు జి. రవికుమార్ తెలియజేశారు.

చదలవాడ బ్రదర్స్ నిర్మించిన 'రోజ్  గార్డెన్'చిత్రం ద్వారా హీరోగా  పరిచయమవుతున్న నితిన్ నాష్ ఈ నూతన చిత్రంలో కూడా హీరోగా నటించనున్నారు. 
'రోజ్ గార్డెన్' సంగీతంతో కూడిన ప్రేమ కథాచిత్రం అయినప్పటికీ ఆ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాల్లో సాహసవంతంగా ఫైట్లు అదరగొట్టిన నితిన్ నాష్ యాక్షన్ హీరోగా రాణించగలడనే పూర్తి నమ్మకంతో పాన్ ఇండియా స్థాయిలో ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని ప్లాన్ చేసినట్లు  చదలవాడ తిరుపతిరావు వెల్లడించారు. 

చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ , "శ్రీలంక, దుబాయ్, ఈజిప్ట్, మలేసియా దేశాల్లో షూటింగ్ జరుపుకునే ఈ తాజా చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేసే ప్లాన్ లో ఉన్నాం. అలాగే ఇతర నటీనటులు, సాంకేతికనిపుణుల ఎంపిక జరుగుతోంది. హాలీవుడ్ కి చెందిన యాక్షన్ కొరియోగ్రాఫర్లను కూడా సంప్రదిస్తున్నాం" అని చెప్పారు.  

అతి త్వరలో 'రోజ్  గార్డెన్' విడుదల 
కాశ్మీర్ లో భారీ ఎత్తున హిందీ, తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన " రోజ్  గార్డెన్" చిత్రం ప్రస్తుతం  ప్రసాద్ ల్యాబ్ లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటోంది. డాల్బీ మిక్సింగ్, డిఐ పనుల దశలో ఉన్న ఈ చిత్రాన్ని నిర్మాతలు అతి త్వరలో ప్రపంచం అంతటా విడుదల చేయబోతున్నారు.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.