![]() |
![]() |

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి.. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఈ పేరే ఒక బ్రాండ్. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే విలక్షణ నటుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారీ టాలెంటెడ్ యాక్టర్. ఈ ఏడాది ఆరంభంలో `మాస్టర్`, `ఉప్పెన` వంటి సెన్సేషనల్ మూవీస్ లో విలన్ గా మెస్మరైజ్ చేసిన సేతుపతి.. ఈ సెప్టెంబర్ లో ముచ్చటగా మూడు సినిమాలతో పలకరించబోతున్నాడు.
ఆ వివరాల్లోకి వెళితే.. వినాయక చవితి స్పెషల్ గా సెప్టెంబర్ 9న విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన `లాభమ్` చిత్రం థియేటర్స్ లో సందడి చేయనుంది. ఇందులో విజయ్ కి జంటగా శ్రుతి హాసన్ నటించింది. కాగా, సెప్టెంబర్ 10న విజయ్ సేతుపతి నటించిన పొలిటికల్ డ్రామా `తుగ్లక్ దర్బార్` జనం ముందుకు రానుంది. రాశీ ఖన్నా నాయికగా నటించిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ లో నేరుగా స్ట్రీమ్ కానుంది.
ఇక అదే నెలలో తాప్సీతో జట్టుకట్టిన `అన్నాబెల్ సేతుపతి` కూడా ఓటీటీలో స్ట్రీమ్ కాబోతోంది. మరో ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సెప్టెంబర్ 17న తమిళ, తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ స్ట్రీమ్ కాబోతోంది. మొత్తమ్మీద.. సెప్టెంబర్ సందడంతా సేతుపతిదే అన్నట్లుగా ఉందన్నమాట. మరి.. వీటిలో ఏయే సినిమాలకు ఆదరణ దక్కుతుందో చూడాలి.
![]() |
![]() |