![]() |
![]() |

'శ్రీదేవి సోడా సెంటర్' సినిమాను సూపర్‌స్టార్ మహేష్‌బాబు చూశారు. బావ సుధీర్ బాబు హీరోగా నటించిన సినిమా కావడంతో సినిమా విడుదలైన రోజు శుక్రవారం... ఇంట్లో అత్యాధునికంగా డిజైన్ చేయించుకున్న హోమ్ థియేటర్లో ప్రత్యేకంగా షో వేయించుకున్నారు. సినిమా చూశాక... హీరో హీరోయిన్లు, దర్శకుడు, సంగీత దర్శకుడు ప్రతి ఒక్కరి గురించి పేరు పేరునా చెప్పుకొంటూ వచ్చారు. సినిమా బావుందంటూ కితాబు ఇచ్చారు.
"హార్డ్ హిట్టింగ్ క్లైమాక్స్ తో తీసిన రా అండ్ ఇంటెన్స్ ఫిలిం 'శ్రీదేవి సోడా సెంటర్'. 'పలాస' తర్వాత దర్శకుడు కరుణ కుమార్ మరో బోల్డ్ ఫిలిం తీశారు. నిస్సందేహంగా సుధీర్ బాబు అద్భుతంగా నటించాడు. నటుడిగా ఇప్పటివరకు అతని అత్యుత్తమ ప్రదర్శన ఇదే. నరేష్ మరోసారి మెమరబుల్ గా నటించారు. ఆనంది గురించి ప్రత్యేకంగా చెప్పాలి. శ్రీదేవి పాత్రలో పర్ఫెక్ట్ గా ఉంది. విజువల్స్ బ్రిలియంట్. నేపథ్య సంగీతాన్ని మర్చిపోలేం. సినిమా టీమ్ అందరికీ మరోసారి కంగ్రాచ్యులేషన్స్" అని మహేష్ బాబు ట్వీట్ చేశారు.

మహేష్ రివ్యూతో సినిమా టీమ్ అంతా గాల్లో తేలుతున్నామని హీరో సుధీర్ బాబు రిప్లై ట్వీట్ చేశారు. కేవలం ట్వీట్ వేయకుండా సవివరంగా విడమర్చి చెప్పినందుకు బావ మహేష్ బాబుకు ఆయన థాంక్స్ చెప్పారు.
![]() |
![]() |