![]() |
![]() |

ఒకవైపు అగ్ర కథానాయకులతోనూ.. మరోవైపు యువ కథానాయకులతోనూ సినిమాలను నిర్మిస్తూ టాక్ ఆఫ్ టాలీవుడ్ అవుతోంది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. ఆరంభంలో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన మైత్రీ.. ఆ తరువాత కాస్త జోరు తగ్గినా.. ఈ మధ్య మళ్ళీ ట్రాక్ లోకి వచ్చేసింది. ఇప్పటికే మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రవితేజ వంటి అగ్ర కథానాయకులతో సినిమాలు నిర్మించిన మైత్రి.. ప్రస్తుతం చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వంటి స్టార్స్ తో క్రేజీ ప్రాజెక్ట్స్ నిర్మిస్తోంది.
ఇదిలా ఉంటే.. ప్రభాస్ తోనూ మైత్రీ మూవీ మేకర్స్ ఓ సినిమా చేయబోతుందంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారట. పాన్ - ఇండియా మూవీగా రాబోతున్న ఈ సినిమా.. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో సెట్స్ పైకి వెళ్ళే అవకాశముందంటున్నారు. త్వరలోనే ప్రభాస్ - సిద్ధార్ధ్ - మైత్రీ కాంబో మూవీపై క్లారిటీ రానున్నది. మరి.. ఈ చిత్రంతో మైత్రీ స్థాయి మరింతగా పెరుగుతుందేమో చూడాలి.
బాలీవుడ్‌లో సిద్ధార్థ్ ఆనంద్ సలామ్ నమస్తే, బచ్‌నా యే హసీనో, బ్యాంగ్ బ్యాంగ్, వార్ లాంటి సినిమాలు రూపొందించాడు. ప్రస్తుతం షారుక్ ఖాన్‌తో 'పఠాన్' తీస్తున్నాడు.
![]() |
![]() |