![]() |
![]() |

కమెడియన్‌గా థర్టీ ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ పృథ్వీకి ఉన్న పేరు ప్రఖ్యాతులు ఎలాంటివో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకానొక దశలో బ్రహ్మానందంకు రీప్లేస్‌మెంట్ అన్నంత ఇమేజ్ కూడా తెచ్చుకున్నారాయన. తర్వాత కాలంలో ఇటు కుటుంబపరంగా, అటు రాజకీయాల పరంగా వివాదాల్లో చిక్కుకోవడంతో అంత దాకా జెట్ స్పీట్‌లో దూసుకుపోతున్న కెరీర్ ఒక్కసారిగా నెమ్మదించింది. ఎస్వీబీసీ చానల్ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు తలెత్తిన వివాదంతో ఆ పదవిని కూడా ఆయన కోల్పోయారు.
కాగా ప్రస్తుతం ఆయన పెద్ద సినిమాల్లో, అదీ ప్యాన్ ఇండియా సినిమాల్లో కనిపించడం లేదు. ఆ ఫ్రస్ట్రేషన్‌ను ఇటీవల ఒక సినిమా ప్రారంభోత్సవంలో చూపించారు పృథ్వీ. 'కాలం రాసిన కథలు' అనే సినిమా ఓపెనింగ్‌కు గెస్ట్‌గా వచ్చి ఫస్ట్ షాట్‌కు క్లాప్ కొట్టిన పృథ్వీ, ఆ తర్వాత జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
"అందరం చిన్నోళ్లమే. ప్యాన్ ఇండియా సినిమాలకు ఎటు తిరిగీ మనల్ని పిలవరు. చిన్న సినిమాలు కాబట్టి మనం ఆశీర్వదించాలి. చిన్న సినిమాలు కాబట్టి మనం రావాలి. చిన్నా పెద్దా ఉండదు. అన్నీ ఒకటే. కెమెరా ఒకటే. టెక్నికల్‌గా ఏమైనా మారొచ్చు. పెద్ద సినిమాకు ఎంత కష్టపడతారో చిన్న సినిమావాళ్లూ అంతే కష్టపడతారు." అని ఆయన అన్నారు. ఆయన మాటల్లో తనకు పెద్ద సినిమాల్లో అవకాశాలు రావడం లేదన్న ఆవేదన తొంగి చూసిందని ఇండస్ట్రీ జనాలు అనుకుంటున్నారు.
నూతన తారలు వెన్నెల, రీతూ ప్రధాన పాత్రలు పోషిస్తోన్న 'కాలం రాసిన కథలు' చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో ఎమ్.ఎన్.వి. సాగర్ నిర్మిస్తున్నారు. మెరుగు అరమాన్ సంగీతం సమకూరుస్తుండగా, దేవి వరప్రసాద్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఎస్.ఎమ్. 4 ఫిలిమ్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందుతోంది.
![]() |
![]() |