![]() |
![]() |

మనందరికీ తెలుసు, లంబోర్గిని ఉరుస్ గ్రాఫైట్ కాప్సూల్ కారును పొందిన ఫస్ట్ ఇండియన్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అని. దేశంలో ఇటీవలే ఈ లగ్జరీ కారును అఫిషియల్‌గా లాంచ్ చేశారు. రూ. 3 కోట్లకు పైగా విలువ చేసే ఈ కారు ఎట్టకేలకు జూనియర్ ఎన్టీఆర్ చెంతకు చేరింది. హైదరాబాద్‌లో తను ప్రస్తుతం షూటింగ్ చేస్తున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో సెట్స్‌కు ఈ కారును డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు తారక్. నటుడు శ్రీకాంత్, మరొక స్నేహితునితో కలిసి బ్లాక్ బ్యూటీ దగ్గర నిల్చొని ఫొటోకు పోజు కూడా ఇచ్చారు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తారక్ ప్రస్తుతం 'ఎవరు మీలో కోటీశ్వరులు' క్విజ్ షోతో బిజీగా ఉన్నారు. 22వ తేదీ ప్రసారమైన కర్టెన్ రైజర్ నుంచే ఈ షో అందరి దృష్టినీ ఆకర్షించింది. కర్టెన్ రైజర్‌లో రామ్‌చరణ్ సెలబ్రిటీ కంటెస్టెంట్‌గా పాల్గొని రూ. 25 లక్షలు గెలుచుకున్నారు. ఆ డబ్బును తన చారిటబుల్ ట్రస్ట్‌గా విరాళంగా ఇచ్చేశారు. రానున్న ఎపిసోడ్లలో కంటెస్టెంట్లు ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ రౌండ్ ద్వారా హాట్ సీట్లలో కూర్చోవడాన్ని మనం చూస్తాం.
ఇటీవలే ఉక్రెయిన్‌లో 'ఆర్ఆర్ఆ'ర్ షూటింగ్‌ను కంప్లీట్ చేశారు తారక్. హైదరాబాద్‌కు వచ్చీ రాగానే 'ఎవరు మీలో కోటీశ్వరులు' షూటింగ్‌తో బిజీ అయ్యారు. ఇది అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న 'కౌన్ బనేగా క్రోర్‌పతి'కి తెలుగు వెర్షన్.
![]() |
![]() |