![]() |
![]() |

మ్యాచో స్టార్ గోపీచంద్ సాలిడ్ హిట్ చూసి చాన్నాళ్ళే అయింది. అప్పుడెప్పుడో `లౌక్యం` (2014) చిత్రంతో చివరిసారిగా సక్సెస్ చూశాడు గోపి. ఆ తరువాత నుంచి తన ఖాతాలో హిట్ బొమ్మ పడలేదు. ఈ నేపథ్యంలో.. విడుదలకు సిద్ధమైన `సీటీమార్`పైనే తన ఆశలు పెట్టుకున్నాడు ఈ టాలెంటెడ్ యాక్టర్. తాజాగా ఈ సినిమాకి సెప్టెంబర్ 3ని రిలీజ్ డేట్ గా లాక్ చేశారు.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. గోపీచంద్ కి సెప్టెంబర్ నెల అచ్చొచ్చిందనే చెప్పాలి. ఇప్పటివరకు ఆ నెలలో గోపీచంద్ హీరోగా నటించిన మూడు చిత్రాలు విడుదల కాగా.. వాటిలో రెండు మంచి విజయం సాధించాయి. ఆ మూడు సినిమాలు.. `శౌర్యం` (2008), `శంఖం` (2009), `లౌక్యం` కాగా.. వీటిలో `శంఖం` మినహా మిగిలిన రెండు చిత్రాలు కూడా విజయపథంలో పయనించాయి. మరి.. `సీటీమార్` కూడా `శౌర్యం`, `లౌక్యం` తరహాలో సక్సెస్ ఫుల్ మూవీగా నిలుస్తుందేమో చూడాలి.
కాగా, `సీటీమార్`కి సంపత్ నంది దర్శకత్వం వహించగా.. గోపీచంద్ కి జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నా నటించింది. మెలోడీబ్రహ్మ మణిశర్మ ఈ స్పోర్ట్స్ డ్రామాకి బాణీలు అందించారు.
![]() |
![]() |