Home

»

Latest News

బాగా అల‌సిపోయాను.. బ్రేక్ కావాలంటున్న స‌మంత‌!

Aug 25, 2021 12:55PM

 

చాలా మంది తార‌లు కొవిడ్ దెబ్బ‌కు ప‌నిలేక సత‌మ‌త‌మ‌వుతుంటే, స‌మంత అక్కినేనికి 2021 బాగా క‌లిసొచ్చింది. ఆమె నెగ‌టివ్ రోల్ పోషించిన 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' సిరీస్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ట‌వ‌డ‌మే కాకుండా, ఇండియ‌న్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ (ఐఎఫ్ఎఫ్ఎమ్‌)లో బెస్ట్ యాక్ట్రెస్ అవార్డునూ సాధించిపెట్టింది. లేటెస్ట్‌గా ఆమె గుణ‌శేఖ‌ర్ డైరెక్ట్ చేస్తోన్న పౌరాణిక చిత్రం 'శాకుంత‌లం' షూటింగ్‌ను పూర్తి చేసింది. ప్ర‌స్తుతం విఘ్నేశ్ శివ‌న్ డైరెక్ట్ చేస్తోన్న త‌మిళ మూవీ 'కాదువాకుల మూడు కాద‌ల్' సినిమాలో న‌య‌న‌తార‌, విజ‌య్ సేతుప‌తితో క‌లిసి న‌టిస్తోంది. అలుపులేకుండా ప‌నిచేసుకుంటూ వ‌స్తోన్న ఆమె ఇప్పుడు ఒక‌ట్రెండు నెల‌లు రెస్ట్ తీసుకోవాల‌ని కోరుకుంటోంది.

ఒక ఇంగ్లీష్ పోర్ట‌ల్‌తో మాట్లాడిన ఆమె, "ఒక‌టి లేదా రెండు నెల‌లు బ్రేక్ తీసుకోవాల‌నుకుంటున్నాను. ఇప్పుడు అల‌సిపోయాన‌నే ఫీలింగ్ క‌లుగుతోంది". అని చెప్పింది. త‌న ప‌ద‌కొండేళ్ల కెరీర్‌లో ఇంత‌దాకా సింగిల్ బ్రేక్ కూడా ఆమె తీసుకోలేదు. నెక్ట్స్ ప్రాజెక్టులోకి అడుగు పెట్టేలోప‌ల కాస్త రిలాక్స్ కావాల‌ని ఆమె అనుకుంటోంది. రిలాక్స్ కావ‌డానికి ఎక్క‌డ‌కు వెళ్లాల‌నేది ఆమె ఇంకా నిర్ణ‌యించుకోలేదు. "అయితే క‌చ్చితంగా హాలిడేకి వెళ్తాను" అని స్ప‌ష్టం చేసింది.

'ద ఫ్యామిలీ మ్యాన్ 2' ప్ర‌మోష‌న్స్‌, రిలీజ్ అవ‌గానే ఆమె 'శాకుంత‌లం' షూటింగ్‌లో పాల్గొంది. అది పూర్త‌వ‌గానే 'కాదువాకుల రెండు కాద‌ల్' ఫైన‌ల్ షెడ్యూల్ కోసం పాండిచ్చేరికి వెళ్లింది. తిరిగి హైద‌రాబాద్ వ‌చ్చిన ఆమె యాడ్ షూటింగ్స్‌లో పార్టిసిపేట్ చేసింది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com