![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజున ఇండస్ట్రీలో యమా సందడి నెలకొంది. చిరంజీవి స్వయంగా నాలుగు సినిమాలు చేస్తుండటంతో ఆయా చిత్రాల దర్శక నిర్మాతలు స్వయంగా కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. మెగా నిర్మాత అల్లు అరవింద్ సహా పలువురు ప్రముఖులు చిరంజీవిని కలిశారు. ఇక, మెగా ఫ్యామిలీ హీరోలు వారసుల గురించి చెప్పనవసరం లేదు. అందరూ ఆదివారం చిరంజీవి ఇంట్లో తిష్ఠ వేశారు. రాఖి పండగ కూడా అక్కడే సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే, ఆ సందడిలో అల్లు అర్జున్ ఎక్కడ కనిపించకపోవడం ప్రజల దృష్టిని ఆకర్షించింది.
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజున, ఆయన ఇంటికి అల్లు అర్జున్ వెళ్లలేదన్నది వాస్తవం. రామ్ గోపాల్ వర్మ లాంటి వివాదాలు వెతుక్కునే వ్యక్తులు ఆ విషయాన్ని హైలైట్ చేశారు. బన్నీ తన ప్రత్యేకత చాటుకున్నాడని కొందరు చెప్పుకొచ్చారు. కొన్నాళ్లుగా అల్లు అర్జున్ తన ప్రత్యేకత చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారన్నది వాస్తవమే. మెగా ముద్ర నుండి బయటకు వచ్చి, తనకంటూ ప్రత్యేకంగా ఇమేజ్, స్టార్ స్టేటస్ కోసం ప్రయత్నిస్తున్నాడు. అందుకని, అటువంటి వార్తలు రావడం సహజమే. మరి, మెగా క్యాంపు నుండి రియాక్షన్ ఎలా ఉంది? అల్లు హీరోలను దూరం పెడుతోందా? తాజా పరిణామాలు చూస్తే అటువంటి సందేహాలు కలగక మానవు.
మెగాస్టార్ పుట్టినరోజు సందడి అంతా వీడియో రూపంగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ యూట్యూబ్ ఛానల్ లో విడుదల చేశారు. అది చూస్తే చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య ఎటువంటి గొడవలు లేవని అర్థమవుతుంది. ముఖ్యంగా 'ఏవండీ సురేఖగారు... బావున్నారా?' అని పవన్ అనడం, ఆయన భుజం మీద వదినగారు కొట్టడాన్ని హైలైట్ చేశారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు సోఫాలో కూర్చోగా... రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి తేజ్, వైష్ణవ్ తేజ్ వెనుక నిలబడిన ఫొటో విడుదల చేశారు. మెగా అభిమానులను ఇవన్నీ ఖుషి చేశాయి. అయితే, వీడియో లేదా ఫొటోల్లో ఎక్కడ అల్లు శిరీష్ కూడా లేడన్నది గమనించాల్సిన అంశం.
మెగాస్టార్ ఇంటికి అల్లు అర్జున్ వెళ్ళలేదు. కానీ, అల్లు శిరీష్ వెళ్ళాడు. జిమ్ నుండి నేరుగా చిరంజీవి మావయ్య దగ్గరకు వెళ్లాడు. ఫ్యామిలీతో కలిసి భోజనం చేశాడు. రామ్ చరణ్ కు నిహారిక రాఖి కట్టిన వీడియో ఎడిట్ చేసింది కూడా శిరీష్. నిహారిక అతడికి క్రెడిట్స్ ఇచ్చారు. అయితే, అల్లు శిరీష్ ఫొటోలను మెగా బ్యాచ్ ఎవరూ రిలీజ్ చెయ్యలేదు. పుట్టినరోజు తర్వాత శిరీష్ పోస్ట్ చేశాడు. కేవలం అల్లు అరవింద్ కు వీడియోలో చోటు కల్పించి శిరీష్ ను మిస్ చేశారు. దీన్నిబట్టి మెగా క్యాంపు కూడా అల్లు హీరోలను దూరం పెడుతున్నాడని కొంతమంది పరిశ్రమ వ్యక్తుల అభిప్రాయం.
ఎవరు ఎన్ని అనుకున్నా... కొణిదెల, అల్లు కుటుంబాల మధ్య బంధుత్వం, బంధం అలాగే ఉంటాయి. పవన్ కల్యాణ్ గురించి 'చెప్పను బ్రదర్' అని అల్లు అర్జున్ అనడం కాంట్రావర్సీకి దారి తీసింది. తర్వాత ఇద్దరూ ఒకే వేదికపై కనిపించారు. పవన్ ఓ సమస్య మీద పోరాడినప్పుడు ఆయనకు అల్లు అర్జున్ మద్దతు తెలిపారు. అదీ సంగతి!
![]() |
![]() |