![]() |
![]() |

బాలకృష్ణ టైటిల్ రోల్ పోషించిన 'డిక్టేటర్' (2016) మూవీలో తెలుగమ్మాయి అంజలి నాయికగా నటించింది. బాలకృష్ణతో కలిసి నటించాలన్నప్పుడు మొదట ఆమె చాలా టెన్షన్ పడింది. 'ఆయన పెద్ద యాక్టర్. ఎలా ఉంటారో, ఎలా బిహేవ్ చేస్తారో' అనుకుంది. కానీ బాలయ్య స్వీట్ పర్సన్ అనీ, సహనటులకు చాలా స్పేస్ ఇస్తారనీ, సలహాలిస్తుంటారనీ ఆమెకు అర్థమైంది. "హి ఈజ్ వెరీ ఫ్రెండ్లీ అండ్ జోవియల్" అని చెప్పింది అంజలి.
"హీరోయిన్ దగ్గర్నుంచీ, లైట్ బాయ్ దాకా సెట్లో ఉన్న అందర్నీ బాలకృష్ణగారు చాలా బాగా చూస్తారు. ఆయనకు కోపం వస్తే బాగా తిట్టేస్తారని విన్నాను. కానీ మా సెట్స్‌పై ఒక్కసారి కూడా ఆయన్నలా చూడలేదు. ఆయన నుంచి సమయపాలన అంటే ఏమిటో నేర్చుకున్నాను. టైమ్ అంటే టైమ్‌కు సెట్స్‌పై ఉంటారు. ఆయన లెజెండరీ యాక్టర్." అని ఆమె చెప్పింది.
నిజానికి బాలకృష్ణతో ఆమె 'డిక్టేటర్' కంటే ముందే రెండు సినిమాలు చేసుండాల్సింది. డేట్స్ ప్రాబ్లెమ్ వల్ల 'లెజెండ్', 'లయన్' మూవీలు చేజారిపోయాయి. 'లెజెండ్'లో రాధికా ఆప్టే చేసిన క్యారెక్టర్‌కు మొదట అడిగింది అంజలినే. కొన్నిసార్లు అలా జరుగుతుందంతే. మూడోసారి వచ్చిన చాన్స్‌ను వదులుకోకూడదని డేట్స్ అడ్జెస్ట్ చేసి ఇచ్చింది. పైగా 'డిక్టేటర్'లో ఉద్యోగిని పాత్ర ఆమెకు నచ్చింది. ఆ పాత్ర కోసం ఆమె ఐదు కిలోల బరువుతగ్గి మరీ నటించింది.
![]() |
![]() |