![]() |
![]() |

తెలుగు, కన్నడ చిత్రాల నటి సంజన, మరో కన్నడ నటి రాగిణి ద్వివేది డ్రగ్స్ వాడారని ఫోరెన్సిక్ రిపోర్టు ధ్రువీకరించిందని బెంగళూరు పోలీసులు వెల్లడించారు. కొంత కాలం క్రితం డ్రగ్ కేసు కన్నడ చిత్రసీమను షేక్ చేసింది. "డ్రగ్ కేసుల్లో వేగంగా, పక్షపాతరహితంగా మా బెంగళూరు పోలీసులు దర్యాప్తు చేశారని అనౌన్స్ చేయడానికి నేను గర్వపడుతున్నాను. గత ఏడాది సెప్టెంబర్‌లో నమోదు చేసిన కేసులో ఇది మంచి పురోగతి" అని బెంగళూరు పోలీస్ కమిషనర్ కమల్ పంత్ జర్నలిస్టులతో చెప్పారు.
సంజన, రాగిణితో పాటు వీరేన్ ఖన్నా, రాహుల్ టాన్సే అనే ఇద్దరు ఈవెంట్ మేనేజర్లు కూడా డ్రగ్స్ వాడినట్లు రిపోర్టులు కన్ఫామ్ చేశాయి. డ్రగ్ కేసులో అరెస్టయిన వారిలో కర్ణాటక మాజీ మంత్రి దివంగత జీవరాజ్ ఆల్వా కుమారుడు ఆదిత్య ఆల్వా కూడా ఉన్నాడు.
"కోర్టులో మేం చార్జి షీట్‌ను ఫైల్ చేశాం కాబట్టి, ఈ టైమ్‌లో నేను ఎక్కువగా చెప్పలేను. కానీ ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం కొంతమంది డ్రగ్స్ తీసుకున్నట్లు స్పష్టంగా ప్రూవ్ అయ్యింది." అని కమల్ పంత్ చెప్పారు. అందిన సమాచారం ప్రకారం, నిందితుల వెంట్రుకల శాంపుల్స్‌ను పరీక్షల కోసం హైదరాబాద్ పంపగా, పాజిటివ్ అని తేలింది. అంటే, దానర్థం వారు డ్రగ్స్ వినియోగించారని. బెంగళూరు పోలీసుల ప్రకారం ఈ కేసు పురోగతికి సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ (CFSL) రిపోర్ట్ ఎంతగానో దోహదపడింది. అన్ని సాక్ష్యాధారాలను పొందగలమనే నమ్మకాన్ని వారికి కలిగించింది.
2020 సెప్టెంబర్ 4న రాగిణి ద్వివేదిని అరెస్ట్ చేసిన సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, సెప్టెంబర్ 8న సంజనను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వారు బెయిల్‌పై బయటకు వచ్చారు.
![]() |
![]() |