![]() |
![]() |
.jpg)
రామ్‌గోపాల్ వర్మ మళ్లీ కెలికారు. మెగా హీరోల విషయంలో మళ్లీ వేలు పెట్టారు. మంగళవారం ఉదయం ఆయన చేసిన ట్వీట్ మెగాస్టార్ ఫ్యాన్స్‌తో పాటు, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ ఫ్యాన్స్‌లో కాక పుట్టించింది. ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. "ఒరిజినల్ మెగాస్టార్ చిరంజీవి తర్వాత నేటి ఒకే ఒక్క మెగాస్టార్ అల్లు అర్జున్." అంటూ ట్వీట్ చేశారు ఆర్జీవీ.
ఎందుకని ఆయన ఇప్పుడు ఆ రకమైన ట్వీట్ చేశారు? అనే సందేహం కలగవచ్చు. దానికీ ఓ నేపథ్యం ఉంది. ఆగస్ట్ 22 చిరంజీవి బర్త్‌డే సెలబ్రేషన్స్ ఆయన ఇంట్లో సందడి సందడిగా జరిగాయి. ఆ వేడుకల్లో దాదాపు చిరంజీవి కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. పవన్ కల్యాణ్ సైతం చిరంజీవి ఇంటికి వచ్చి అన్నయ్యకు శుభాకాంక్షలు తెలిపి, వదిన సురేఖను సరదాగా పలకరించి, కుర్ర మెగా హీరోలతో ముచ్చటించారు. దీనికి సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యింది.
అయితే ఈ వీడియోను చూసినవాళ్లకు అల్లు అర్జున్ కనిపించలేదేమిటి? అనే సందేహం వచ్చింది. అల్లు అరవింద్ దంపతులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు కానీ బన్నీ కానీ, ఆయన భార్యా పిల్లలు కానీ ఈ సెలబ్రేషన్స్‌లో కనిపించలేదు. దాంతో ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఒకరేమో యాడ్ షూట్‌లో ఉండటం వల్ల బన్నీ రాలేకపోయాడని అన్నారు. ఇంకొకరేమో 'పుష్ప' షూటింగ్‌లో ఉండటం వల్ల రాలేకపోయాడని చెప్పారు. ఇలా బన్నీ అక్కడ కనిపించకపోవడానికి రకరకాల కారణాలు చెప్పారు అతని ఫ్యాన్స్.
సహజంగానే ఆర్జీవీ దృష్టిని ఈ వ్యవహారం ఆకర్షించింది. మెగా ఫ్యామిలీకి సంబంధించి ఏ చిన్న అంశం దొరికినా మనోడు వదలడు కదా.. అందుకే బన్నీ మెగాస్టార్ అయిపోయాడు కాబట్టే, ఆ ఫంక్షన్‌కు రాలేదనే అర్థం వచ్చేలా ఆ ట్వీట్ చేశాడని పలువురు భావిస్తున్నారు. ఆ ట్వీట్ చేయడం ద్వారా మరోసారి పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టాడు ఆర్జీవీ. అయితే పీకే ఫ్యాన్స్ మాత్రమే కాదు, మెగా ఫ్యాన్స్ అంతా ఆర్జీవీ ట్వీట్‌పై కారాలు మిరియాలు నూరుతున్నారు.
.jpg)
![]() |
![]() |