![]() |
![]() |

మణిరత్నం దర్శకత్వం వహిస్తోన్న ఎపిక్ ఫిల్మ్ 'పొన్నియన్ సెల్వన్' షూటింగ్ ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని ఒర్ఛాలో జరుగుతోంది. లేటెస్ట్‌గా ఆ సినిమా సెట్స్ నుంచి ఐశ్వర్యారాయ్ ఫొటో ఒకటి ఆన్‌లైన్‌లో లీకై, వైరల్‌గా మారింది. ఈ మూవీలో నందిని, మందాకినీ దేవి అనే రెండు పాత్రలను ఐశ్వర్య పోషిస్తున్నారు. లీకైన ఫొటోలో ఆమె బ్రైట్ పింక్ కలర్ సిల్కు చీరలో కనిపిస్తున్నారు. ఆమె ఒంటి నిండా భారీ ఆభరణాలున్నాయి. ఆమె చుట్టూ అసిస్టెంట్లతో పాటు, యూనిట్ మెంబర్స్ కనిపిస్తున్నారు. ఆ ఫొటో చూస్తుంటే తర్వాత షాట్ కోసం ఐశ్వర్య రెడీ అవుతున్నట్లుగా ఉంది.
కొన్ని వారాలుగా ఐశ్వర్య 'పొన్నియన్ సెల్వన్' షూటింగ్‌లో పాల్గొంటున్నారు. జూలైలో పాండిచ్చేరిలో కొన్ని ఇంపార్టెంట్ సీన్స్‌లో నటించారు. మధ్యప్రదేశ్‌లోని ఒర్ఛాలో షెడ్యూల్ ఇటీవలై మొదలైంది. ఈ షెడ్యూల్‌లో విక్రమ్, జయం రవి, కార్తీ, త్రిష, ప్రకాశ్‌రాజ్ లాంటి పేరుపొందిన తారలు పాల్గొంటున్నారు.
కల్కి కృష్ణమూర్తి రచించిన సుప్రసిద్ధ నవల 'పొన్నియన్ సెల్వన్' ఆధారంగా ఈ మూవీ రూపొందుతోంది. చోళ సామ్రాజ్యాన్ని కూలదోయడంలో కీలక పాత్ర వహించిన నందిని జీవితం చుట్టూ ఈ కథ నడుస్తుంది. ఆమె భర్త పెరియ పళువెట్టరయ్యర్ పాత్రను శరత్‌కుమార్ చేస్తున్నాడు. ఈ సినిమాకు ఎ.ఆర్. రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు.

![]() |
![]() |