![]() |
![]() |

సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం `అణ్ణాత్తే`. `శౌర్యం` శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మాస్ ఎంటర్టైనర్ లో రజినీ ఓ వైవిధ్యభరితమైన పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఖుష్బూ, మీనా, నయనతార, కీర్తి సురేశ్, ప్రకాశ్ రాజ్, సూరి ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి డి. ఇమాన్ బాణీలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ తుది దశలో ఉంది. మరోవైపు డబ్బింగ్ కార్యక్రమాలు కూడా జోరుగా జరుగుతున్నాయి.
ఇదిలా ఉంటే.. దీపావళి కానుకగా నవంబర్ 4న `అణ్ణాత్తే` థియేటర్స్ లో సందడి చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారించనుందట యూనిట్. ఇందులో భాగంగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని వినాయక చవితి స్పెషల్ గా సెప్టెంబర్ 10న రివీల్ చేయబోతున్నారట. అంతేకాదు.. అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఉంటుందని బజ్. త్వరలోనే `అణ్ణాత్తే` ఫస్ట్ లుక్ కి సంబంధించి క్లారిటీ రానుంది. కాగా, ఈ చిత్రం తెలుగు అనువాదానికి `అన్నయ్య` అనే టైటిల్ ప్రముఖంగా వినిపిస్తోంది.
![]() |
![]() |