![]() |
![]() |

కోలీవుడ్ స్టార్ అజిత్ సరసన కనువిందు చేసిన నాయికల్లో లేడీ సూపర్ స్టార్ నయనతార ఒకరు. `బిల్లా` (2007), `ఏగన్` (2008), `ఆరంభం` (2013), `విశ్వాసమ్` (2019) చిత్రాల్లో ఈ ఇద్దరు జంటగా సందడి చేశారు. వీటిలో `ఏగన్` మినహాయిస్తే.. మిగిలిన మూడు తమిళ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి.
ఇదిలా ఉంటే.. త్వరలోనే అజిత్, నయన్ మరోసారి జోడీకట్టే అవకాశముందని టాక్. ఆ వివరాల్లోకి వెళితే.. `ఖాకి` ఫేమ్ హెచ్. వినోద్ దర్శకత్వంలో `నేర్కొండ పార్వై`, `వలిమై` చిత్రాల తరువాత అజిత్ మరో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. బోనీ కపూర్ నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్ మూవీ ఈ ఏడాది చివరలో లేదా వచ్చే సంవత్సరం ఆరంభంలో సెట్స్ పైకి వెళ్ళనుంది. కాగా, ఈ క్రేజీ ప్రాజెక్ట్ లోనే అజిత్ కి జంటగా నయనతార నటించబోతోందట. ఈ మేరకు నయన్ తో సంప్రదింపులు కూడా పూర్తయ్యాయని సమాచారం. త్వరలోనే అజిత్, వినోద్ థర్డ్ జాయింట్ వెంచర్ లో నయన్ ఎంట్రీపై ఫుల్ క్లారిటీ రానున్నది.
కాగా, అజిత్ - వినోద్ కాంబినేషన్ లో రూపొందుతున్న రెండో సినిమా `వలిమై` చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ సంవత్సరాంతంలో ఈ యాక్షన్ ఎంటర్టైనర్ థియేటర్స్ లో సందడి చేయనుంది.
![]() |
![]() |