![]() |
![]() |

కింగ్ నాగార్జున సాలిడ్ హిట్ చూసి చాన్నాళ్ళే అయింది. అప్పుడెప్పుడో `సోగ్గాడే చిన్ని నాయనా` (2016)తో బ్లాక్ బస్టర్ కొట్టారు నాగ్. ఆ తరువాత వచ్చిన సినిమాలేవీ కమర్షియల్ గా రాణించలేకపోయాయి. ఇక రీసెంట్ గా వచ్చిన `వైల్డ్ డాగ్` కూడా విమర్శకుల ప్రశంసలు పొందినా.. బాక్సాఫీస్ విన్నర్ కాలేకపోయింది. ఈ నేపథ్యంలో.. నాగార్జున కొత్త చిత్రాలపైనే ఆశలు పెట్టుకున్నారు అభిమానులు.
ప్రస్తుతం నాగ్ చేతిలో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో ఒకటి `గరుడవేగ` ఫేమ్ ప్రవీణ్ సత్తారు రూపొందిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ కాగా.. మరొకటి `సోగ్గాడే చిన్ని నాయనా`కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న `బంగార్రాజు`. ఈ రెండు సినిమాలు కూడా ఇటీవలే పట్టాలెక్కాయి. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఈ రెండు చిత్రాలను కూడా కేవలం మూడు నెలల గ్యాప్ లో రిలీజ్ చేసే దిశగా ప్లాన్ చేస్తున్నారట నాగ్. దానికి తగ్గట్టే.. చిత్రీకరణ కూడా శరవేగంగా పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నారు ఆయా చిత్రాల దర్శకులు. మరి.. తక్కువ గ్యాప్ లోనే రాబోతున్న ఈ చిత్రాలతో నాగ్ మళ్ళీ తన స్థాయి విజయాలను అందుకుంటారేమో చూడాలి.
![]() |
![]() |