![]() |
![]() |

ఆదివారం (ఆగస్ట్ 22) మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. ఒకవైపు ఆయన జన్మదినం, మరోవైపు రాఖీ పూర్ణిమ కావడంతో చిరంజీవి కుటుంబమంతా ఆయన ఇంట్లో సందడి చేసింది. అమ్మ అంజనాదేవి, భార్య సురేఖ, నాగబాబు, పవన్ కల్యాణ్, వారి అక్కచెల్లెళ్లు, కుమారులు, కూతుళ్లు, మేనల్లుళ్లు, మనవళ్లు, మనవరాళ్లు అంతా ఒక్కచోట చేరడంతో ఆ సందడిని, సంబరాన్ని వర్ణించడానికి మాటలు చాలవన్నట్లు వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ కూడా చోటు చేసుకున్నాయి.
.jpg)
పవన్ కల్యాణ్ వచ్చినప్పుడు భావోద్వేగ వాతావరణం ఏర్పడింది. అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతుండగా, వదిన సురేఖ అక్కడకు వచ్చారు. ఆమెను చూడగానే, "సురేఖగారూ బావున్నారండీ" అని సరదాగా పలకరించారు పవన్. వెంటనే ఆమె అతని చేతిపై ఆప్యాయంగా తట్టారు. ఆమెను పవన్ దగ్గరకు తీసుకుంటుంటే, చిరంజీవి అపురూపంగా వారివంక చూశారు.

వదినా మరిది మధ్య ఉన్న అనుబంధానికి ఆ దృశ్యం అద్దం పట్టింది. తల్లి తర్వాత తల్లిగా సురేఖను పవన్ పరిగణిస్తుంటారు. ఆమె కూడా అతడిని మరిది లాగా కాకుండా కొడుకు లాగే చూసుకున్నారు. ఆ తర్వాత పవన్‌ను అన్నయ్యలు చిరు, నాగబాబు ఇద్దరూ చెంపపై ముద్దుపెట్టారు. ఆప్యాయంగా అన్నలను కౌగలించుకున్నారు పవన్.
.jpg)
దీనికి సంబంధించిన ఓ వీడియోను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ యూట్యూబ్ చానల్‌లో పోస్ట్ చేశారు. అందులో కొడుకు కోడలు రామ్‌చరణ్, ఉపాసనలు ఇద్దరికీ చిరు ముద్దులు పెట్టారు.

సన్నిహిత బంధువులందరి సమక్షంలో చిరు బర్త్‌డే కేక్ కోశారు. ఈ వేడుకలో అల్లు అరవింద్ దంపతులు, చిరు తోడల్లుడు కె. వెంకటేశ్వరరావు దంపతులు, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సుష్మిత, శ్రీజ, నిహారిక-చైతన్య దంపతులు.. ఇలా పలువురు హాజరయ్యారు. అయితే అల్లు అర్జున్-స్నేహ దంపతులు ఈ వేడుకలో కనిపించలేదు.



![]() |
![]() |