![]() |
![]() |

రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన బ్లాక్‌బస్టర్ మూవీ 'కాంచన 3' (2019)లో ఒక హీరోయిన్‌గా నటించిన రష్యన్ మోడల్ అలెగ్జాండ్రా జావి గోవాలోని తను అద్దెకు ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో ఉరేసుకొని మృతి చెంది ఉండటం ఇండస్ట్రీ వర్గాలను షాక్‌కు గురిచేసింది. 'కాంచన 3' మూవీలో వేదిక, ఓవియా, నిక్కీ తంబోలి, అలెగ్జాండ్రా హీరోయిన్లుగా నటించారు. నటనను కెరీర్‌గా చేపట్టిన అలెగ్జాండ్రా కొంత కాలంగా చెన్నైలోనే నివాసం ఉంటోందని కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. గోవాలోనూ ఆమెకు ఓ అద్దె ఫ్లాట్ ఉంది.
అందిన సమాచారం ప్రకారం ఆమె ఫ్లాట్‌లోని ఓ రూమ్‌లో ఉరివేసి ఉండగా పోలీసులు కనుకొన్నారు. శుక్రవారం ఆమె చనిపోయిందనీ, గదికి లోపలివైపు గడియ వేసి ఉందనీ వారు తెలిపారు. ఆమెది ఆత్మహత్య కావచ్చని వారు భావిస్తున్నారు. అటాప్సీ రిపోర్ట్ వచ్చాకే ఆమె మృతికి కారణం తెలియవచ్చు.
మెడికో లీగల్ ఫార్మాలిటీస్ నిమిత్తం అధికారిక ప్రతినిధులను నియమించాలని రష్యన్ ఎంబసీకి గోవా పోలీసులు లేఖ రాశారు. మృతురాలి కుటుంబ ప్రతినిధి అంగీకారం తెలిపిన వెంటనే ఆమెకు పోస్ట్‌మార్టం నిర్వహిస్తామని రష్యన్ కాన్సులేట్ మీడియాకు తెలియజేసింది.
గమనించాల్సిన విషయమేమంటే.. ఒక ఫొటోగ్రాఫర్ తనతో గడపాల్సిందిగా బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడంటూ 2019లో అలెగ్జాండ్రా పోలీసులకు ఫిర్యాదు చేసింది.
![]() |
![]() |