![]() |
![]() |

కథానాయికగా మిల్కీ బ్యూటీ తమన్నాది పదహారేళ్ళ ప్రాయం. ఇప్పటికీ వన్నె తరగని అందాలతో, చేతినిండా సినిమాలతో వార్తల్లో నిలుస్తోందీ ఉత్తరాది సొగసరి. ఒకవైపు గ్లామర్ రోల్స్ లో కనువిందు చేస్తూనే.. మరోవైపు పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ లో మెస్మరైజ్ చేస్తోందీ టాలెంటెడ్ యాక్ట్రస్.
ఇదిలా ఉంటే.. ఈ సెప్టెంబర్ తమన్నాకి ఎంతో ప్రత్యేకమనే చెప్పాలి. ఎందుకంటే.. వారాల వ్యవధిలో ఈ మిల్కీ బ్యూటీ నటించిన రెండు తెలుగు సినిమాలు జనం ముందుకు రాబోతున్నాయి. రెండింటిలోనూ అభినయానికి ఆస్కారమున్న పాత్రల్లో నటించడమే కాకుండా.. తన పాత్రలకు తనే డబ్బింగ్ చెప్పుకుందీ భామ. ఆ చిత్రాలే.. `సీటీమార్`, `మాస్ట్రో`.
స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన `సీటీమార్`లో కబడ్డీ కోచ్ జ్వాలా రెడ్డిగా దర్శనమివ్వనున్న తమన్నా.. బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ `అంధాధున్`కి రీమేక్ గా రూపొందిన `మాస్ట్రో`లో నెగటివ్ రోల్ లో కనిపించనుంది. `మాస్ట్రో` సెప్టెంబర్ ప్రథమార్ధంలో నేరుగా ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానుండగా.. `సీటీమార్` థియేటర్స్ లో రిలీజ్ కానుంది.
సో.. వేదిక ఏదైనా మిల్కీ బ్యూటీ నుంచి ఆమె అభిమానులకు డబుల్ ధమాకా పక్కా అన్నమాట! చూద్దాం.. ఈ చిత్రాలతో తమన్నా ఎలాంటి ఫలితాలను, గుర్తింపుని పొందుతుందో!!
![]() |
![]() |