![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న 153వ చిత్రానికి 'గాడ్‌ఫాదర్' అనే టైటిల్ ఖరారు చేశారు. మలయాళంలో మోహన్‌లాల్ నటించిన ఇండస్ట్రీ హిట్ ఫిల్మ్ 'లూసిఫర్'కు ఇది రీమేక్. ఆగస్ట్ 22 చిరు బర్త్‌డే సందర్భంగా ఒకరోజు ముందుగా నిర్మాతలు టైటిల్‌ను ప్రకటించడంతో పాటు, లోగో పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో చేతిలో రివాల్వర్, తలకు క్యాప్‌తో చిరు షాడోగా కనిపిస్తున్నారు. హనుమాన్ జంక్షన్ ఫేమ్ మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకుడు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబానికి అండగా నిలిచే పాత్రలో చిరంజీవి కనిపించనున్నారు. అందుకే 'గాడ్‌ఫాదర్' అనే టైటిల్ పెట్టినట్లు అర్థమవుతోంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై సురేఖ కొణిదెల సమర్పిస్తోన్న ఈ మూవీని మెగా సూపర్‌గుడ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తోన్న ఈ మూవీకి నీరవ్ షా సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు.

చిరంజీవి ప్రస్తుతం తన 152వ సినిమా 'ఆచార్య'ను కొరటాల శివ డైరెక్షన్‌లో చేస్తున్నారు. అందులో ఆయన తనయుడు రామ్‌చరణ్‌తో స్క్రీన్ పంచుకుంటున్నాడు. చిరు జోడీగా కాజల్ అగర్వాల్, చెర్రీ సరసన పూజా హెగ్డే నటిస్తున్నారు. దసరాకు ఈ సినిమా వస్తుందని ప్రచారం నడుస్తున్నప్పటికీ, 2022 సంక్రాంతికి వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు.
![]() |
![]() |