![]() |
![]() |

కొత్త చిత్రం `రాధే శ్యామ్`తో సంక్రాంతి బరిలో దిగుతున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఈ సీజన్ లో ప్రభాస్ కథానాయకుడిగా నటించగా రిలీజవుతున్న మూడో సినిమా ఇది. గతంలో `వర్షం` (2004), `యోగి` (2007) చిత్రాలతో ముగ్గుల పండక్కి మురిపించాడీ ఉప్పలపాటి వారి హ్యాండ్సమ్ హీరో. కాకపోతే, పాన్ - ఇండియా స్టార్ హోదాలో ప్రభాస్ నుంచి వస్తున్న తొలి పొంగల్ మూవీగా `రాధే శ్యామ్`పై స్పెషల్ ఫోకస్ ఉంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. పొంగల్ బరిలో దిగిన ప్రతి సారీ ప్రభాస్‌కి మెగా పోరు తప్పడం లేదు. ఆ వివరాల్లోకి వెళితే.. ప్రభాస్ ఫస్ట్ సంక్రాంతి రిలీజ్ `వర్షం` విడుదలైన తరువాతి రోజే మెగాస్టార్ చిరంజీవి నటించిన `అంజి` సినిమా రిలీజ్ కాగా.. సెకండ్ పొంగల్ మూవీ `యోగి` రిలీజ్ కి రెండు రోజుల ముందు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన `దేశముదురు` తెరపైకి వచ్చింది.
కట్ చేస్తే.. ముచ్చటగా మూడోసారి ప్రభాస్ నుంచి రానున్న సంక్రాంతి సినిమా `రాధే శ్యామ్`కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం `భీమ్లా నాయక్` నుంచి పోటీ ఎదురవుతోంది. మొత్తమ్మీద.. సంక్రాంతి బరిలో నిలుస్తున్న మూడోసారి కూడా ప్రభాస్ కి మెగా కాంపౌండ్ పోరు తప్పడం లేదన్నమాట!
మరి.. ఒకసారి బ్లాక్‌బస్టర్ ని, మరోసారి ఫ్లాప్‌ని చూసిన సంక్రాంతి సీజన్ లో `మెగా` పోటీ సమేతంగా ప్రభాస్ ఈ సారి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.
![]() |
![]() |