![]() |
![]() |

తన ప్రీవియస్ మూవీ `గీత గోవిందం`(2018)తో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్న యువ దర్శకుడు పరశురామ్.. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబుతో `సర్కారు వారి పాట` చేస్తున్నాడు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. సంక్రాంతి కానుకగా 2022 జనవరి 13న థియేటర్స్ లో సందడి చేయనుంది.
ఇదిలా ఉంటే.. `సర్కారు వారి పాట` తరువాత యువ సామ్రాట్ నాగచైతన్యతో ముందు అనుకున్నట్లుగా ఓ చిత్రం చేయబోతున్నాడట పరశురామ్. అనంతరం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ఓ భారీ బడ్జెట్ మూవీ చేసే దిశగా అడుగులు వేయబోతున్నట్లు సమాచారం. అంతేకాదు.. ఈ చిత్రాన్ని బన్నీ హోమ్ బేనర్ గీతా ఆర్ట్స్ నిర్మించబోతోందని వినికిడి. `పుష్ప`, `ఐకాన్` తరువాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా ఇదేనని టాక్. త్వరలోనే బన్నీ, పరశురామ్ కాంబినేషన్ మూవీపై క్లారిటీ రానున్నది.
మరి.. `శ్రీరస్తు శుభమస్తు`, `గీత గోవిందం` వంటి విజయవంతమైన చిత్రాల తరువాత గీతా ఆర్ట్స్ సంస్థలో పరశురామ్ చేయనున్న ఈ సినిమా.. ఆ బేనర్ లో హ్యాట్రిక్ హిట్ గా నిలుస్తుందేమో చూడాలి.
![]() |
![]() |