![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ లో నటిస్తున్న తాజా చిత్రం `ఆచార్య`. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరో హీరోగా నటిస్తున్న ఈ సోషల్ డ్రామాని వరుస విజయాల దర్శకుడు కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో చిరు, చరణ్ నెవర్ సీన్ బిఫోర్ రోల్స్ లో దర్శనమివ్వనున్నారు. ప్రస్తుతం ఈ మల్టీస్టారర్ కి సంబంధించిన చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.
ఇదిలా ఉంటే.. మే 13న విడుదల కావాల్సిన `ఆచార్య`.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. మిగిలిన భారీ బడ్జెట్ మూవీస్ అన్నీ డేట్స్ లాక్ చేసుకుంటున్నా.. `ఆచార్య` కొత్త రిలీజ్ డేట్ పై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. సంక్రాంతి సీజన్ లో `ఆచార్య` రాబోతోందట. అది కూడా.. చిరుకి అచ్చొచ్చిన తేదిన. అదే.. జనవరి 7. గతంలో ఇదే తేదిన మెగాస్టార్ టైటిల్ రోల్ లో నటించిన `అన్నయ్య` చిత్రం విడుదలై అఖండ విజయం సాధించింది. మరి.. 22 ఏళ్ళ తరువాత అదే తేదిన రాబోతున్న చిరు.. ఈ సారి ఎలాంటి ఫలితం అందుకుంటారో చూడాలి. త్వరలోనే `ఆచార్య` విడుదల తేదీపై క్లారిటీ రానుంది.
కాగా, `ఆచార్య`లో చిరుకి జంటగా కాజల్, చరణ్ కి జోడీగా పూజా హెగ్డే దర్శనమివ్వనుండగా.. మెలోడీబ్రహ్మ మణిశర్మ బాణీలు అందిస్తున్నారు.
![]() |
![]() |