![]() |
![]() |
.jpg)
నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా ‘అఖండ’ చిత్రీకరణ చివరిదశలో ఉంది. రెండు సాంగ్స్ షూటింగ్ చేసే సినిమా కంప్లీట్ అవుతుందట. దాంతో ఎప్పుడు రిలీజ్ చెయ్యాలనే అంశమై దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి మధ్య డిస్కషన్లు జరుగుతున్నాయని ఫిల్మ్‌నగర్ టాక్. బాలకృష్ణను సంప్రదించి బోయపాటి ఏది చెబితే అదే ఫైనల్. నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి అయినప్పటికీ, అన్ని విషయాలూ ఆయనే దగ్గరుండి చూసుకుంటున్నారు. దసరా సీజన్లో రిలీజ్ చెయ్యాలని బోయపాటి శ్రీను ఆలోచిస్తున్నారట.
ఓ నందమూరి హీరో, ఓ కొణిదెల కథానాయకుడు తొలిసారి కలిసి నటిస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. దర్శకుడు ధీరుడు రాజమౌళితో గతంలో పని చేసిన అనుభవం, ఆయనపై నమ్మకంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ చేస్తున్నారు. ఎటువంటి ఆటంకాలు ఏర్పడకుండా ఉంటే అక్టోబర్ 13న సినిమా విడుదల కావడం గ్యారెంటీ. దానికి వారం రోజుల ముందు అక్టోబర్ 8న ‘అఖండ’ విడుదల చెయ్యాలనుకుంటున్నార్ట. విజయదశమి సెలవుల్లో వసూళ్లు బాగా వస్తాయని, ‘ఆర్ఆర్ఆర్’ విడుదలైనా రెండో వారానికి థియేటర్లు సరిపడా ఉంటాయని ‘అఖండ’ టీమ్ భావిస్తున్నదట. మరి, ఏం జరుగుతుంతో చూడాలి.
![]() |
![]() |