![]() |
![]() |

పాయల్ రాజ్ పుత్.. `ఆర్ ఎక్స్ 100`తో తెలుగు తెరపైకి దూసుకొచ్చిన ఢిల్లీ సోయగం. మొదటి సినిమాతోనే సంచలన విజయం అందుకున్న ఈ సొగసరి.. ఆపై `ఆర్.డి.ఎక్స్ లవ్`, `వెంకిమామ`, `డిస్కో రాజా` చిత్రాలతో సందడి చేసింది. వీటిలో `వెంకిమామ` మాత్రమే చెప్పుకోదగ్గ విజయం సాధించింది. కట్ చేస్తే.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో మూడు తెలుగు చిత్రాలున్నాయి. అందులో ఒకటి ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ కావడం విశేషం. `5Ws` పేరుతో రూపొందుతున్న సదరు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీలో పోలీస్ పాత్రలో కనిపించనుంది పాయల్.
ఇదిలా ఉంటే.. `5Ws` కాకుండా పాయల్ చేతిలో ఉన్న మిగిలిన రెండు సినిమాల్లోనూ ఒకరే హీరోగా నటిస్తున్నాడు. ఆ కథానాయకుడు మరెవరో కాదు.. ఆది సాయికుమార్. వీరభద్రమ్ చౌదరి రూపొందిస్తున్న `కిరాతక`లోనూ.. `నాటకం` ఫేమ్ కళ్యాణ్ గోగుల తెరకెక్కిస్తున్న `టీఎంకే` (వర్కింగ్ టైటిల్)లోనూ ఆది, పాయల్ జంటగా నటిస్తున్నారు. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. ఒకే హీరోతో పాయల్ ఇలా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేయడం ఇదే మొదటిసారి. మరి.. ఆది, పాయల్ జోడీ బాక్సాఫీస్ ముంగిట బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటుందేమో చూడాలి.
![]() |
![]() |