![]() |
![]() |
.jpg)
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కి మెలోడీబ్రహ్మ మణిశర్మ కాంబినేషన్ వెరీ స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే.. తన తండ్రి, మెగాస్టార్ చిరంజీవికి పలు చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ ని అందించిన మణి.. తన మొదటి సినిమా `చిరుత` (2007)కి వీనులవిందైన బాణీలు అందించారు. సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆపై ఐదేళ్ళ అనంతరం చరణ్ - మణిశర్మ కాంబినేషన్ లో వచ్చిన `రచ్చ` (2012) కూడా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించింది.
కట్ చేస్తే.. తొమ్మిదేళ్ళ సుదీర్ఘ విరామం తరువాత వీరిద్దరి కలయికలో ముచ్చటగా మూడో సినిమా వస్తోంది. అదే.. `ఆచార్య`. ఇందులో మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ లో నటిస్తుండగా.. మరో హీరోగా రామ్ చరణ్ సందడి చేయనున్నాడు. అంతేకాదు.. ఇందులో చరణ్ కి రెండు పాటలుంటాయని టాక్. అందులో ఒకటి చిరు కాంబినేషన్ లో వచ్చే సిట్యుయేషనల్ సాంగ్ కాగా.. మరొకటి పూజా హెగ్డేతో డ్యూయెట్. ఈ రెండింటికి కూడా మణిశర్మ వీనులవిందైన బాణీలు అందించారని టాక్. మరి.. `ఆచార్య` కోసం ముచ్చటగా మూడోసారి జట్టుకట్టిన చరణ్ - మణిశర్మ.. హ్యాట్రిక్ అందుకుంటారేమో చూడాలి.
కాగా, `ఆచార్య`ని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తున్నారు. చిత్రీకరణ తుది దశకు చేరుకున్న ఈ సినిమాలో చిరుకి జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. సోనూ సూద్, ప్రకాశ్ రాజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
![]() |
![]() |