![]() |
![]() |

మహేశ్ ఫస్ట్ టైమ్ కిస్ సీన్‌లో నటించింది ఎస్.జె. సూర్య డైరెక్ట్ చేసిన 'నాని' మూవీలో. అందులో హీరోయిన్ అమీషా పటేల్‌తో చుంబన సన్నివేశంలో నటించాడు. అయితే పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన 'బిజినెస్‌మేన్' మూవీలో కాజల్ అగర్వాల్‌తో చేసిన కిస్ సీన్‌కు వచ్చిన ప్రాచుర్యం మరే కిస్ సీన్‌కు రాలేదు. ప్రతి చిత్రంలోనూ ఏదో ఒక వైవిధ్యం చూపించడం పూరికి అలవాటు. 'బిజినెస్‌మేన్'లో హీరో హీరోయిన్లు మహేశ్, కాజల్ అగర్వాల్ మధ్య తీసిన లిప్ లాక్ సీన్ సంచలనం సృష్టించింది. సాధారణంగా మహేశ్‌కు తెరమీద చుంబన సన్నివేశాలు, హద్దుమీరిన శృంగారం, అందాల ఆరబోతలు నచ్చవు. ముద్దు సీన్లలో నటించేది లేదని అంతకు కొద్ది రోజుల క్రితమే కాజల్ ప్రకటించింది.
అలాంటిది.. 'బిజినెస్‌మేన్'లో ఇద్దరూ మహేశ్, కాజల్ అంత గాఢంగా ముద్దు పెట్టుకోవడం ఫ్యాన్స్ సహా అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అక్కడ అలాంటి సన్నివేశం పెట్టక తప్పలేదనీ, మహేశ్‌ను ఒప్పించడానికి తంటాలు పడాల్సి వచ్చిందనీ ఆ తర్వాత పూరి చెప్పాడు. ఆ ముద్దు సీనును మహేశ్ భార్య నమ్రతా శిరోద్కర్ చూసి, దాన్ని చాలా తేలిగ్గా తీసుకుంది. ఆ సన్నివేశానికి తన అభ్యంతరమేమీ లేదనీ, సన్నివేశం ప్రకారం అది చేశారనీ ఆమె అభిప్రాయపడింది. మొత్తానికి ఆ లిప్ లాక్ సీన్ టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారింది.
మహేశ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన 'పోకిరి' ఇండస్ట్రీ హిట్ కాగా, 'బిజినెస్‌మేన్' సూపర్ హిట్. వారి కాంబినేషన్‌లో మూడో సినిమా ఎప్పుడొస్తుందా, మహేశ్‌ను పూరి ఈసారి ఎలా చూపిస్తాడా అని 'బిజినెస్‌మేన్' వచ్చిన తర్వాత నుంచీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తూనే ఉన్నారు. మహేశ్ కోసం పూరి 'జనగణమన' అనే సబ్జెక్టును కూడా రెడీ చేశాడు. కానీ.. దానికి మహేశ్ ఓకే చెప్పలేదు. అప్పట్నుంచీ ఇంతదాకా వేరే డైరెక్టర్లకు చాన్సులిస్తూ వస్తున్నాడు కానీ పూరికి ఎందుకనో మూడో సినిమా చేసే చాన్స్ ఇవ్వడం లేదు.
![]() |
![]() |