![]() |
![]() |

సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ వచ్చేసింది. మహేష్ తాజా చిత్రం 'సర్కారు వారి పాట' నుంచి.. చెప్పిన టైం కంటే కొన్ని గంటలు ముందుగానే 'బర్త్ డే బ్లాస్టర్' వీడియోని విడుదల చేసింది మూవీ టీమ్. ఒక నిమిషం 17 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో ఆద్యంతం ఆకట్టుకుంటోంది.
'ఇందు మూలంగా యావన్ మంది ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా'.. అంటూ సర్కారు వారి పాట బ్లాస్టర్ ప్రారంభమైంది. మెడలో ఓం లాకెట్, మెడపై రూపాయి కాయిన్ టాటూతో మహేష్ స్టైల్ గా ఎంట్రీ ఇచ్చాడు. 'ఇఫ్ టైగర్ టేక్స్ రాబిట్' అంటూ మహేష్ తనదైన శైలిలో డైలాగ్ చెప్పి కేక పుట్టించాడు. 'ఇఫ్ యూ మిస్ ది ఇంట్రస్ట్.. యు విల్ గెట్ ది డేట్' అంటూ విలన్ గ్యాంగ్ కి మహేష్ వార్నింగ్ ఇచ్చిన విధానం ఆకట్టుకుంది. అలాగే విలన్ గ్యాంగ్ తో ఫైట్ సమయంలో ఆయన చేసిన స్టంట్స్ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ వీడియోలో మహేష్ లుక్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అల్ట్రా స్టైలిష్ లుక్ లో పాతికేళ్ళ కుర్రాడిలా కనిపిస్తూ సర్ప్రైజ్ చేస్తున్నాడు.
ఇక ఈ బ్లాస్టర్ లో కీర్తి సురేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహేష్ స్టైలిష్ గా కనిపిస్తే.. కీర్తి పూజలు, పూలతో పద్ధతిగా కనిపిస్తోంది. 'సర్ పడుకునే ముందు ప్రతిరోజు దిష్టి తీయడం మర్చిపోకండి' అంటూ మహేష్ అందం గురించి కీర్తి చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. అలాగే లాస్ట్ లో జడ నిండా మల్లెపూలు పెట్టుకున్న కీర్తిని చూపిస్తూ.. వెన్నెల కిషోర్ తో మహేష్ 'ఏమోయ్ కిషోర్.. ఓ ఐదారు మూరలు ఉండవవి' అని చెప్పిన డైలాగ్ నవ్వులు పూయిస్తుంది.
సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ అన్ని కరెక్ట్ గా కుదిరిన ఈ బ్లాస్టర్ వీడియో మహేష్ బర్త్ డేకి ఫ్యాన్స్ కి ఇచ్చిన పెద్ద గిఫ్ట్ అని చెప్పొచ్చు. 'సర్కారు వారి పాట చిత్రానికి పరశురాం దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.
![]() |
![]() |