![]() |
![]() |

విక్టరీ వెంకటేశ్ కి అచ్చొచ్చిన దర్శకుల్లో రవిరాజా పినిశెట్టి ఒకరు. వీరిద్దరి కాంబినేషన్ లో మూడు చిత్రాలు వచ్చాయి. వాటిలో `చంటి` (1992) ఇండస్ట్రీ హిట్ కాగా.. `కొండపల్లి రాజా` (1993) చెప్పుకోదగ్గ విజయం సాధించింది. ఈ రెండు సినిమాలు కూడా తమిళ చిత్రాలకు రీమేక్ వెర్షన్స్ కావడం విశేషం. అయితే, మూడో చిత్రం మాత్రం స్ట్రయిట్ పిక్చర్ నే. అదే `సరదా బుల్లోడు`. అత్తాఅల్లుళ్ళ మధ్య సాగే వినోదభరిత ప్రయత్నంగా ఈ సినిమా రూపొందింది. `కొండపల్లి రాజా`లో వెంకీకి జంటగా ఆకట్టుకున్న నగ్మా ఇందులోనూ నాయికగా నటించగా.. `చంటి`లో కీలక పాత్రలో నటించిన సీనియర్ నటి మంజుల ఇందులో వెంకీకి అత్తగా అలరించారు. సంఘవి, సత్యనారాయణ, మురళీమోహన్, శ్రీహరి, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, ఎం. బాలయ్య, సంగీత, మధురిమ, వై. విజయ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
కోటి సంగీతమందించిన ఈ చిత్రంలోని పాటలన్నీ ప్రజాదరణ పొందాయి. మరీముఖ్యంగా.. ``రంగా రంగా సింగారంగా``, ``మోగిందోయమ్మో`` చార్ట్ బస్టర్స్ గా నిలవగా.. ``చిత్త కార్తెలో చినుకులు``, ``దాని వయ్యారం``, ``నాటు కోడి పెట్టోయమ్మ``, ``జిలేలే జిలేలే`` కూడా మాస్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశాయి. విజయలక్ష్మి ఆర్ట్ మూవీస్ పతాకంపై టి.త్రివిక్రమరావు నిర్మించిన ఈ చిత్రం.. 1996 ఆగస్టు 9న విడుదలైంది. నేటితో `సరదా బుల్లోడు` పాతికేళ్ళు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |