![]() |
![]() |
.jpg)
`ఫిదా` వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందించిన చిత్రం `లవ్ స్టోరి`. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్.. చాన్నాళ్ళ క్రితమే చిత్రీకరణ పూర్తిచేసుకుంది. పాటలు, ప్రచార చిత్రాలకి మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో.. ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. అయితే, సినిమా విడుదలకు సిద్ధమైన తరుణంలో కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో.. వాయిదా తప్పలేదు.
లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని విజయదశమి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ జరుగుతోందట. అన్నీ అనుకూలంగా ఉంటే అక్టోబర్ 6న దసరా స్పెషల్ గా థియేటర్స్ లో రిలీజ్ చేయాలని శేఖర్ కమ్ముల భావిస్తున్నారట. అంటే.. `ఆర్ ఆర్ ఆర్` కంటే వారం ముందుగా `లవ్ స్టోరి` తెరపైకి రాబోతుందన్నమాట. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
ఇదిలా ఉంటే.. గతంలో శేఖర్ కమ్ముల రూపొందించిన `ఆనంద్` (2004) చిత్రం విజయదశమి బరిలోనే విడుదలై మంచి విజయం సాధించింది. ఇక చైతూ విషయానికి వస్తే.. `ప్రేమమ్` (2016) రూపంలో ఓ దసరా హిట్ ని సొంతం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో.. అటు శేఖర్ కి, ఇటు చైతూకి `లవ్ స్టోరి` మరో మెమరబుల్ దసరా సీజన్ మూవీ అవుతుందేమో చూడాలి.
![]() |
![]() |