![]() |
![]() |
.jpg)
ఏ భాషకు చెందినవారైనా సెలబ్రిటీలతో స్నేహం చేయడం మోహన్‌బాబు అలవాటు. అందునా ఇతర భాషలకు చెందిన అగ్రతారలతో ఆయన సన్నిహిత సంబంధాలను నెరపుతుంటారు. తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఆయనకు ఎంతటి సన్నిహిత స్నేహితులో మనకు తెలుసు. అలాగే మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్ కూడా మోహన్‌బాబుకు మంచి మిత్రుడు. మీనా అయితే ఆయన సరసన హీరోయిన్‌గా నటించారు. హైదరాబాద్ శివార్లలోని తన ఇంట్లో మోహన్‌లాల్, మీనాలకు ఆయన విందు ఇచ్చారు.
మోహన్‌లాల్, మీనా ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతున్న బ్రో డాడీ మూవీ షూటింగ్ నిమిత్తం హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. ఆ మూవీని పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేస్తున్నాడు. దృశ్యమ్ సిరీస్‌లో భార్యాభర్తలుగా నటిస్తోన్న మోహన్‌లాల్, మీనా మరోసారి బ్రో డాడీలో జంటగా నటిస్తున్నారు.
డిన్నర్ అయ్యాక అందరూ కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ, హాయిగా నవ్వుకుంటున్న ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు లక్ష్మీ మంచు. ఆ ఫొటోలకు “That’s one hell of a LEGENDARY DINNER with the “M”s of the “M”ovies!!” అనే క్యాప్షన్ జోడించారు.
మోహన్‌లాల్ నుదుటన పొడవాటి తిలకంతో కనిపిస్తున్నారు. ఈ డిన్నర్ మీట్‌లో మోహన్‌బాబు, మీనాలతో పాటు మోహన్‌బాబు భార్య నిర్మల, లక్ష్మి మంచు, విష్ణు-విరానికా దంపతులు కూడా పాల్గొన్నట్లు ఫొటోలను బట్టి తెలుస్తోంది.
.jpg)
![]() |
![]() |