![]() |
![]() |

వెంకటేశ్ సరసన 'కలియుగ పాండవులు' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినప్పుడు ఖుష్‌బూ అటు సన్నగా కాకుండా, ఇటు లావుగా కాకుండా మధ్యస్థంగా కనిపించారు. క్రమేణా ఆమె బొద్దుగా తయారయ్యారు. ఇక డైరెక్టర్ సుందర్‌తో వివాహమయ్యాక ఆమె బాగా బరువు పెరిగారు. అయినప్పటికీ ఎప్పుడూ కళగా, ఆరోగ్యంగా కనిపిస్తూ వచ్చారు. 'స్టాలిన్' మూవీలో చిరంజీవికి అక్కయ్యగా నటించినప్పుడు కూడా ఆమె లావుగానే ఉన్నారు.
కాగా రీసెంట్‌గా తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన ఓ ఫొటోతో అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశారు ఖుష్‌బూ. సెల్ఫీ తీసుకుంటున్నట్లు దిగిన ఆ ఫొటోకు, "హార్డ్‌వర్క్ ఎట్టకేలకు ఫలితాల్ని చూపించడం మొదలుపెట్టినప్పుడు" అనే క్యాప్షన్ జోడించారు. #weightlossgoal #fitnessmotivation అనే హ్యాష్‌ట్యాగ్స్ కూడా పెట్టారు. దాన్ని బట్టి బరువు తగ్గడానికి ఆమె బాగా శ్రమిస్తూ వచ్చారని అర్థమవుతోంది.
ఆ ఫొటోలో ఆమె చాలా మారిపోయి కనిపిస్తున్నారు. బరువు బాగా తగ్గారు. అలాగని ముఖంలోని కళ ఏమాత్రం తగ్గలేదు. ఆమెను చూస్తుంటే 50 సంవత్సరాల వయసున్నట్లు ఏమాత్రం అనిపించడం లేదు. ఆమె రూపాంతరం యువతారలకు కూడా ఇన్‌స్పిరేషన్ కలిగించేట్లు ఉంది. ఆమె ఫొటో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

ఖుష్‌బూ ఇటీవలే రజనీకాంత్ సినిమా 'అన్నాత్తే' షూటింగ్‌ను పూర్తి చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో శర్వానంద్-రష్మిక సినిమా 'ఆడవాళ్లు మీకు జోహార్లు' షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ మూవీలో ఆమె తన తోటి చెన్నై తారలు రాధిక, ఊర్వశితో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.
![]() |
![]() |