![]() |
![]() |

2018 క్రిస్మస్ సీజన్ లో రిలీజైన `కేజీఎఫ్: ఛాప్టర్ 1` ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రధానంగా కన్నడంలో రూపొందిన ఈ పిరియడ్ యాక్షన్ డ్రామా.. పాన్ - ఇండియా మూవీగా రిలీజై అన్ని భాషల్లోనూ వసూళ్ళ వర్షం కురిపించింది. అంతేకాదు.. రాకింగ్ స్టార్ యశ్, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి పాన్ - ఇండియా ఇమేజ్ ని కట్టబెట్టింది. ఈ నేపథ్యంలో.. `కేజీఎఫ్` రెండో భాగమైన `కేజీఎఫ్: ఛాప్టర్ 2`పై ఎనలేని అంచనాలు నెలకొని ఉన్నాయి. దానికితోడు, యశ్ పుట్టినరోజు కానుకగా విడుదలైన టీజర్.. యూట్యూబ్ ముంగిట సంచలనం సృష్టించింది.
అన్నీ అనుకూలంగా ఉండీఉంటే.. జూలై 16న ఈ సెన్సేషనల్ మూవీ థియేటర్స్ లో సందడి చేసి ఉండేది. అయితే, కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో వాయిదా తప్పలేదు. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. క్రిస్మస్ స్సెషల్ గా డిసెంబర్ 17న `ఛాప్టర్ 2`ని రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారట. `ఛాప్టర్ 1`కి ఆ సీజన్ ప్లస్ అయినట్లే.. `ఛాప్టర్ 2`కి కూడా క్రిస్మస్ సీజన్ అడ్వాంటేజ్ అవుతుందని భావిస్తున్నారట. మరి.. ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, `కేజీఎఫ్: ఛాప్టర్ 2`లో సంజయ్ దత్, రవీనా టాండన్ వంటి బాలీవుడ్ ప్రముఖులతో పాటు ప్రకాశ్ రాజ్, రావు రమేశ్, ఈశ్వరీ రావ్ ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు.
![]() |
![]() |