![]() |
![]() |

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ - సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో ఓ భారీ బడ్జెట్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. చరణ్ 15వ సినిమాగా రూపొందనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకి 50వ చిత్రం. సెప్టెంబర్ 8 నుంచి పట్టాలెక్కనున్న ఈ బిగ్ టికెట్ ఫిల్మ్.. వచ్చే ఏడాది జూలై కల్లా చిత్రీకరణ పూర్తిచేసుకుంటుందని సమాచారం.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని కథానాయికగా కన్ఫామ్ అయిన సంగతి తెలిసిందే. కాగా, ఈ పాన్ - ఇండియా మూవీ కోసం కియారా భారీ పారితోషికమే పుచ్చుకుంటోందట. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఈ సినిమాకి గానూ అక్షరాలా ఐదు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకుంటోందట కియారా. అంతేకాదు.. మిస్ అద్వాని కెరీర్ హయ్యస్ట్ రెమ్యూనరేషన్ కూడా ఇదేనని టాక్. మరి.. ఈ ప్రచారంలో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, గతంలో చరణ్, కియారా `వినయ విధేయ రామ` చిత్రంలో జోడీగా నటించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన సదరు యాక్షన్ డ్రామా.. బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలయ్యింది. మళ్ళీ మూడున్నరేళ్ళ తరువాత ఇప్పుడు శంకర్ డైరెక్టోరియల్ కోసం జట్టుకట్టారు చరణ్ - కియారా. ఈ సారైనా వీరి కాంబినేషన్ కి సక్సెస్ దక్కుతుందో లేదో చూడాలి.
![]() |
![]() |