![]() |
![]() |
.jpg)
అమితాబ్ బచ్చన్‌ను "రియల్ లైఫ్ హీరో" అని అభివర్ణించిన సీనియర్ నటుడు సుమన్ ఒక సినిమాలో కేవలం ఒక సన్నివేశం కోసం అయినా ఆయనతో కలిసి పనిచేయడం తనకు చాలా ఇష్టమని అన్నారు. తెలుగు, తమిళ ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన ఈ 61 ఏళ్ల నటుడు ప్రస్తుతం ఓ తమిళ సినిమా షూటింగ్‌లో పాల్గొనడానికి చెన్నై వెళ్లారు.
అక్కడ జర్నలిస్టులతో మాట్లాడుతూ, "బచ్చన్ గొప్ప నటుడని అందరికీ తెలుసు. కాని నేను ఆయనను నిజ జీవిత హీరోగా కూడా భావిస్తాను. కొన్ని సంవత్సరాల క్రితం ఆయన తన జీవితంలోనే అత్యంత కఠినమైన కాలాన్ని సైతం అధిగమించారు. సినిమాల్లో బలంగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు" అని అన్నారు సుమన్.
"నేను ఏ చిత్రంలోనైనా బచ్చన్‌తో కలిసి పనిచేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. కేవలం ఒక సన్నివేశం కోసం ఆయనతో కలిసి పనిచేసే అవకాశం వస్తే, దానికి కూడా సిద్ధంగా ఉన్నాను" అని ఆయన చెప్పారు.
కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కారణంగా డిజిటల్ మీడియంకు ఆదరణ పెరగడం గురించి అడిగిన ప్రశ్నకు, సుమన్ సమాధానమిస్తూ ఈ ఆరోగ్య సంక్షోభం కారణంగా సినిమా హాళ్లు తాత్కాలికంగా మూసివేయబడినందున, చాలా మంది ప్రజలు ఓటీటీ వేదికపై సినిమాలు చూడటం ప్రారంభించారని అన్నారు. కానీ మహమ్మారి ముగిసిన తరువాత, ప్రేక్షకులు సినిమాలు చూడటానికి థియేటర్లకు తిరిగి వస్తారని ఆయ చెప్పారు.
![]() |
![]() |