![]() |
![]() |

కోలీవుడ్ హీరో విశాల్ మరోసారి తీవ్రంగా గాయపడ్డారు. ఇటీవల విశాల్ తన 31వ సినిమా 'నాట్ ఎ కామన్ మ్యాన్' షూటింగ్ సమయంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఫైట్ సీక్వెన్స్ సమయంలో సమన్వయ లోపం ఏర్పడటంతో ఆయన తలకు, కంటికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే ఇదే సినిమా షూటింగ్ లో తాజాగా ఆయన మరోసారి గాయపడ్డారు.
'నాట్ ఎ కామన్ మ్యాన్' సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తుండగా విశాల్ బలంగా గోడను ఢీకొని కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో ఆయన వెన్ను భాగానికి గాయమైంది. దీంతో వైద్యులు ఆయనకి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని మూవీ టీమ్ వెల్లడించింది.
శరవణన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో విశాల్ విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. ఈ మూవీకి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.
![]() |
![]() |