![]() |
![]() |

ఒకవైపు అగ్ర కథానాయకులకి జోడీగా అలరిస్తూనే.. మరోవైపు ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ లో ఆకట్టుకుంటోంది బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా. కాగా, త్వరలో ఈ టాలెంటెడ్ యాక్ట్రస్ ఓ హారర్ కామెడీ మూవీతో సందడి చేయనుంది.
ఆ వివరాల్లోకి వెళితే.. సోనాక్షి, రితీశ్ దేశ్ ముఖ్ ప్రధాన పాత్రల్లో మరాఠీ దర్శకుడు ఆదిత్య సర్పోట్ దర్ `కకుడా` పేరుతో ఓ హారర్ కామెడీని రూపొందిస్తున్నాడు. ఓ వింతశాపానికి గురైన పల్లెటూరు నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. రోనీ స్క్రూవాలా నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించిన చిత్రీకరణ మంగళవారం నుంచి ప్రారంభమైంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో `కకుడా` లాంటి వినోదాత్మక చిత్రం అవసరమని, ఓ ప్రేక్షకురాలిగా ఈ తరహా సినిమాలను తను బాగా ఆస్వాదిస్తానని చెప్పుకొచ్చింది సోనాక్షి. అలాగే వచ్చే ఏడాది ప్రథమార్ధంలో `కకుడా` తెరపైకి రాబోతున్నట్లు మిస్ సిన్హా తెలిపింది. మరి.. ఈ హారర్ కామెడీ సోనాక్షి కెరీర్ కి ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.
ఇదిలా ఉంటే.. సోనాక్షి తాజా చిత్రం `భుజ్: ద ప్రైడ్ ఆఫ్ ఇండియా` ఆగస్టు 13న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానుంది. ఈ పిరియడ్ వార్ డ్రామాలో అజయ్ దేవగణ్, శరద్ కేల్కర్, ప్రణీత ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.
![]() |
![]() |