![]() |
![]() |

వైవిధ్యభరితమైన పాత్రలకు చిరునామాగా నిలుస్తున్న తమిళ కథానాయకుల్లో ధనుష్ ఒకరు. సినిమా సినిమాకి నటుడిగా ఎదుగుతున్న ఈ వెర్సటైల్ స్టార్.. త్వరలో జర్నలిస్ట్ గా పలకరించబోతున్నాడు.
ఆ వివరాల్లోకి వెళితే.. యంగ్ డైరెక్టర్ కార్తిక్ నరేన్ దర్శకత్వంలో ధనుష్ ఓ యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన తుది దశ చిత్రీకరణ హైదరాబాద్ లో జరుగుతోంది. కాగా, ఈ చిత్రంలో ధనుష్ ఓ జర్నలిస్ట్ గా కనిపించబోతున్నాడని సమాచారం. అంతేకాదు.. ఇందులో అతనికి జోడీగా కనిపించనున్న `మాస్టర్` బ్యూటీ మాళవికా మోహనన్ కూడా జర్నలిస్ట్ గానే దర్శనమివ్వనుందని వినికిడి. కాగా, ఈ సినిమాలో ధనుష్, మాళవిక మధ్య సాగే సన్నివేశాలు హైలైట్ గా నిలుస్తాయని టాక్.
మరి.. జర్నలిస్ట్ పాత్రలో ధనుష్ ఏ స్థాయిలో రంజింపజేస్తాడో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
ఇదిలా ఉంటే.. ఇటీవలే హాలీవుడ్ మూవీ `గ్రే మ్యాన్`ని పూర్తిచేసిన ధనుష్.. త్వరలో సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో ఓ పాన్ - ఇండియా మూవీలో నటించనున్నాడు. అదే విధంగా తన సోదరుడు, ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ కాంబినేషన్ లోనూ ఓ సినిమా చేయబోతున్నాడు.
![]() |
![]() |