![]() |
![]() |

శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. తిరుమల కిషోర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ప్రాజెక్టును ప్రకటించి చాలా రోజులే అయింది. అయితే ఒక వైపు కరోనా సెకండ్ వేవ్.. మరోవైపు శర్వానంద్, రష్మిక ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వలన, ఈ ప్రాజెక్టు ఆలస్యమవుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.
'ఆడవాళ్లు మీకు జోహార్లు' రెగ్యులర్ షూటింగ్ మంగళవారం మొదలైందని అధికారికంగా తెలియజేస్తూ, అందుకు సంబంధించిన ఫొటోను విడుదల చేశారు మేకర్స్. ఈ ఫొటోలో హీరో హీరోయిన్లతో పాటుగా దర్శకుడు ఉన్నారు. హీరో హీరోయిన్లతో పాటుగా ఇతర ప్రధాన తారాగణంపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఈ షెడ్యూల్లో చిత్రీకరించనున్నారు.

శర్వానంద్ ప్రస్తుతం అజయ్ భూపతి దర్శకత్వంలో 'మహాసముద్రం' అనే సినిమా చేస్తున్నాడు. అలాగే ఇటీవల 'ఒకే ఒక జీవితం' అనే సినిమాను అనౌన్స్ చేశాడు. ఇప్పుడు 'ఆడవాళ్ళూ మీకు జోహార్లు' సినిమాను కూడా పట్టాలెక్కించాడు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
![]() |
![]() |