![]() |
![]() |

ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే ఈ తరం నటుల్లో ఆది పినిశెట్టి ఒకరు. కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, గుణచిత్ర నటుడిగా.. ఇలా ఏ వేషమేసినా ఆది తనదైన ముద్రవేస్తాడు. మరీముఖ్యంగా.. `సరైనోడు`లో ఆది పోషించిన బ్యాడీ రోల్ (వైరం ధనుష్) తనకి నటుడిగా ఎనలేని గుర్తింపుని తీసుకువచ్చింది. ఆపై `అజ్ఞాతవాసి`లోనూ నెగటివ్ రోల్ లో కనిపించిన ఆదికి.. ఆ సినిమాతో ఆశించిన ఫలితం దక్కలేదు.
కట్ చేస్తే.. స్వల్ప విరామం అనంతరం మరోమారు విలన్ పాత్రలో నటించేందుకు సిద్ధమయ్యాడు ఆది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా కోలీవుడ్ కెప్టెన్ లింగుస్వామి రూపొందిస్తున్న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలోనూ తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ఆది పినిశెట్టి పోషిస్తున్న పాత్రకు సంబంధించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. `రాపో 19`లో గ్యాంగ్ స్టర్ రోల్ లో దర్శనమివ్వనున్నాడట ఆది. అంతేకాదు.. `సరైనోడు`కి ఏ మాత్రం తగ్గకుండా ఈ రోల్ ఉంటుందని బజ్. త్వరలోనే ఆది చేస్తున్న పాత్రకి సంబంధించి ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశముంది.
కాగా, `రాపో 19`లో `ఉప్పెన` ఫేమ్ కృతి శెట్టి నాయికగా నటిస్తుండగా.. నదియా ఓ ముఖ్య పాత్రలో కనిపించనుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని 2022 సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్లు ప్రచారం సాగుతోంది.
![]() |
![]() |