Home

»

Latest News

అశ్లీల చిత్రాల కేసులో శిల్పాశెట్టి భర్త అరెస్ట్

Jul 20, 2021 11:33AM

ప్రముఖ పారిశ్రామిక వేత్త, బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌ కుంద్రాను పోర్నోగ్రఫీ కేసులో ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు. అశ్లీల చిత్రాలను చిత్రీకరించి కొన్ని మొబైల్‌ యాప్స్‌ ద్వారా ప్రసారం చేస్తున్నార్న ఆరోపణలతో రాజ్‌ కుంద్రాను సోమవారం రాత్రి పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

ముంబయి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోర్న్‌ వీడియోలను యాప్స్ లో విడుదల చేస్తున్నారన్న ఆరోపణలపై రాజ్‌ కుంద్రాపై గత ఫిబ్రవరిలో కేసు నమోదైందని తెలిపారు. ఈ వ్యవహారంలో రాజ్‌కుంద్రానే ప్రధాన కుట్రదారుడిగా ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. మొబైల్‌ యాప్‌లలో విడుదల చేస్తున్న వీడియోలకు రాజ్‌ కుంద్రా నిర్మాతగా వ్యవహరించారని.. ఇందుకు సంబంధించి పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. మరిన్ని వివరాలను రాబట్టడానికే రాజ్‌ కుంద్రాను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

అయితే, తనపై వచ్చిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని రాజ్‌ కుంద్రా అంటున్నారు. కాగా, శిల్పాశెట్టి- రాజ్‌కుంద్రాలు 2009లో వివాహం చేసుకున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com