Home

»

Latest News

'ఘాజి' డైరెక్టర్ బాలీవుడ్ ఎంట్రీ.. హీరోగా ఎన్టీఆర్ విలన్

Jul 19, 2021 10:16PM

రానా దగ్గుబాటి నటించిన 'ఘాజి' సినిమాతో డైరెక్టర్ గా పరిచయమయ్యాడు సంకల్ప్ రెడ్డి. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ యంగ్ డైరెక్టర్.. ఆ తరువాత తీసిన 'అంతరిక్షం' సినిమాతోనూ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తన మూడో సినిమాను బాలీవుడ్ లో తీయబోతున్నాడు.

ఈ మధ్యకాలంలో పలువురు టాలీవుడ్‌ డైరెక్టర్స్ బాలీవుడ్ కు వెళ్తున్నారు. తెలుగులో 'అర్జున్ రెడ్డి' సినిమా తీసిన సందీప్ రెడ్డి అదే సినిమాను 'కబీర్ సింగ్' పేరుతో హిందీలో రీమేక్ చేశాడు. అలాగే జెర్సీ ఫేమ్ గౌతమ్‌ తిన్ననూరి, హిట్‌ మూవీ ఫేమ్‌ శైలేష్‌ కొలను కూడా బాలీవుడ్‌ బాట పట్టారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో సంకల్ప్ రెడ్డి చేరాడు.

తెలుగులో ఎన్టీఆర్‌ హీరోగా చేసిన 'శక్తి', 'ఊసరవెల్లి', తమిళ్ లో విజయ్‌ హీరోగా చేసిన 'తుపాకి' చిత్రాల్లో విలన్‌ గా కనిపించిన విద్యుత్‌ జమ్వాల్‌ను సంకల్ప్‌ రెడ్డి డైరెక్ట్‌ చేయబోతున్నాడు. విద్యుత్‌ జమ్వాల్‌ హీరోగా సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రానికి ‘ఐబీ 71’ అనే టైటిల్‌ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాతో విద్యుత్‌ జమ్వాల్‌ నిర్మాతగానూ మారుతుండటం విశేషం. ఇందులో ఆయన ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ గా కనిపించనున్నారట. మరి ఈ సినిమాతో సంకల్ప్ రెడ్డి బాలీవుడ్ లో ఎలాంటి ముద్ర వేస్తాడో చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com